
విగ్రహ ఆవిష్కరణ కరపత్రాన్ని ఆవిష్కరిస్తున్న నాయకులు
హుస్నాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితులను విస్మరిస్తున్నాయని దళిత హక్కుల పోరాటసమితి రాష్ట్రనాయకుడు తాళ్లపల్లి లక్ష్మణ్ అన్నారు. పట్టణంలోని అనభేరి, సింగిరెడ్డి అమరులభవన్‌లో గురువారం దళిత హక్కుల పోరాట జిల్లా రెండవ మహాసభ జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ దళితులు ఇప్పటికీ కులవివక్ష ఎదుర్కొంటున్నారన్నారు. సామాజికంగా, న్యాయపరంగా వారిని రక్షించడంలో పాలక ప్రభుత్వాలు విఫలమయ్యా యన్నారు. ఈ సమావేశంలో సంఘ జిల్లాకార్యదర్శి వేల్పుల బాలమల్లు, సీపీఐ రాష్ట్రసమితి సభ్యుడు గడిపె మల్లేశ్, జిల్లా కార్యవర్గసభ్యులు జాగిరి సత్యనారాయణ, కనుకుంట్ల శంకర్, జిల్లా కౌన్సిల్ సభ్యులు భాస్కర్, కొమురయ్య, జనార్దన్, పద్మ, తదితరులు పాల్గొన్నారు.
నేడు అంబేడ్కర్ విగ్రహావిష్కరణ
దుబ్బాక: రాయపోల్ మండలపరిధిలోని బేగంపేటలో శుక్రవారం నిర్వహించే అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీబీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు అన్నారు. విగ్రహావిష్కరణ కరపత్రాన్ని గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రజాయుద్ధనౌక గద్దర్ హాజరవుతున్నారన్నారు. అంబేడ్కర్ యూత్ అధ్యక్షుడు ప్రకాష్, యూత్ సభ్యులు స్వామి, ప్రఽశాంత్, భూపాల్, బాలకృష్ణ, సందీప్, సంతోష్, రాజు, తదితరులున్నారు.
ఆదరణ లేకనే
సమ్మేళనాలు
నంగునూరు(సిద్దిపేట): బీఆర్‌ఎస్‌కు ప్రజల్లో ఆదరణ తగ్గడంతో ఆత్మీయ సమ్మేళనం పేరిట వారికి దగ్గరయ్యేందుకు అష్టకష్టాలు పడుతున్నారని టీపీసీసీ సంయుక్త కార్యదర్శి దేవులపల్లి యాదగిరి అన్నారు. గురువారం నంగునూరులో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మంత్రి హరీశ్‌రావు ప్రజలను మభ్య పెడుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో లంచాలతో పనులయ్యాయని చెప్పిన హరీశ్‌రావు అప్పటి ప్రభుత్వంలో మంత్రిగా ఎందుకు పని చేశారో చెప్పాలన్నారు. సమావేశంలో ఎంపీటీసీ నితిన్‌కుమార్, చెలికాని యాదగిరి, శ్రీకాంత్‌యాదవ్, నాగరాజు, కృష్ణ, కిషన్, శ్రీనివాస్, సంజీవ్, తిరుపతి, రాజు తదితరులు పాల్గొన్నారు.
విద్యాశాఖ కమిషనర్ పరామర్శ
బెజ్జంకి(సిద్దిపేట): రాష్ట్ర విద్యాశాఖ స్టేట్ ప్రాజెక్టు అడిషనల్ డైరెక్టర్ గాజర్ల రమేష్‌ను రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ దేవసేన పరామర్శించారు. మండల పరిధిలోని గుండారంలో గాజర్ల రమేష్ తండ్రి గాజర్ల బాలయ్య గురువారం గుండెపోటుతో మరణించారు. రమేష్‌ను పరామర్శించినవారిలో డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి, ఎంఈఓ పావని తదితరులు ఉన్నారు.

మాట్లాడుతున్న తాళ్లపల్లి లక్ష్మణ్

మాట్లాడుతున్న యాదగిరి