
మాట్లాడుతున్న ఏడీఏ బాబు నాయక్
దుబ్బాక: నకిలీ ఎరువులు, విత్తనాలను విక్రయిస్తే చట్టరిత్యా కఠిన చర్యలు తీసుకుంటామని గజ్వేల్ ఏడీఏ బాబు నాయక్ హెచ్చరించారు. మంగళవారం రాయపోల్ మండల రైతు వేదికలో ఫర్టిలైజర్ డీలర్లు, యజమానులతో సమావేశం నిర్వహించారు. అధికారులు ధృవీకరించిన విత్తనాలు, ఎరువులను మాత్రమే రైతులకు విక్రయించాలని, ప్రభుత్వం నిర్ణయించిన ధరకు అమ్మాలని సూచించారు. నిబంధనలు పాటించనివారిపై కేసులు నమోదు చేసి, దుకాణాలు సీజ్ చేస్తామని అన్నారు. రైతులు కొనుగోలు చేసిన ఎరువుల బిల్లులపై సంతకాలు చేయాలని, షాప్‌లో నిల్వ సమాచారాన్ని స్టాక్ బోర్డులో ప్రదర్శించాలన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ ఏఓ నాగరాజు, ఏఈఓ ప్రశాంత్, తదితరులున్నారు.