
మాట్లాడుతున్న రీజినల్ కోఆర్డినేటర్ నిర్మల
సిద్దిపేటకమాన్: మనిషి ఎదుగుదలకు జ్ఞానం అవసరమని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ రీజినల్ కో–ఆర్డినేటర్ నిర్మల అన్నారు. ప్రోగ్రెసివ్ పేరెంట్ లీగ్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు శంకర్ ఆధ్వర్యంలో మంగళవారం సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. గురుకుల విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న సౌక్రయాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతీ రెండో శనివారం గురుకులాల్లో తల్లిదండ్రుల సమావేశం ఉంటుందని, పిల్లల స్థితిగతులపై చర్చించాలని సూచించారు. మంత్రి హరీశ్‌రావు సహకారంతో జిల్లాకు బీఎస్సీ అగ్రికల్చర్ గురుకుల కళాశాల మంజూరైందని, ప్రోగ్రెసివ్ పేరెంట్స్ లీగ్ ఆధ్వర్యంలో గురుకులాల బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో బీపీఎల్ రాష్ట్ర కోకన్వీనర్ సదానందం, మహిళా కమిటీ ప్రధాన కార్యదర్శి జ్యోతి, ప్రతినిధులు భాగ్యలక్ష్మి, మధు, రామాంజనేయులు, జనార్ధన్, సంజీవ్, భూపాల్, బాబురావు, సురేష్, బాబు, లావణ్య, రాజమల్లవ్వ, రూప తదితరులు పాల్గొన్నారు.