
డీఈఓ శ్రీనివాస్‌రెడ్డికి వినతిపత్రం అందిస్తున్న నాయకులు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): పదో తరగతి పరీక్ష పేపర్ల వాల్యుయేషన్ కోసం ఉపాధ్యాయుల ఎంపిక పారదర్శకంగా నిర్వహించాలని తెలంగాణ నాన్ స్పౌజ్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు కోరారు. మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా టీఎన్‌ఎస్‌టీఏ నాయకులు మాట్లాడుతూ మూల్యాంకనం కోసం సీనియార్టీ ప్రాతిపదికన ఎంపిక చేయలని, ప్రతీ పాఠశాల నుంచి 50శాతం మించకుండా ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాలన్నారు. నాన్ స్పౌస్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్.పద్మారెడ్డి, పి.రవీందర్ రెడ్డి, జిల్లా ప్రతినిధులు రామస్వామి, సిద్ధేశ్వర్, జనార్దన్ రెడ్డి, సురేష్ కుమార్, దేవరుషి, బిక్షపతి, భాస్కర్, శివరాజం, రామస్వామి, వెంకటేశం పాల్గొన్నారు.