
ఆదాయాన్ని లెక్కిస్తున్న ఆలయ సిబ్బంది, శివశక్తి సేవాసమితి సభ్యులు
కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి హుండీ ద్వారా రూ1,16,07,684 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి బాలాజీ తెలిపారు. సోమవారం ఆలయ ముఖ మండపంలో సిద్దిపేట కోటిలింగేశ్వర ఆలయ ఈఓ విశ్వనాథశర్మ, శివరామకృష్ణ భజనమండలి సభ్యులు హుండీని లెక్కించారు. 25రోజుల అనంతరం లెక్కించిన హుండీ ద్వారా నగదు రూ.1,16,07,684, విదేశి కరెన్సీ 14నోట్లు, మిశ్రమ బంగారం 148 గ్రాములు, వెండి 12కిలోల 500 గ్రాములు, పసుపు బియ్యం 33 క్వింటాళ్లు వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నగదును బ్యాంక్‌లో జమ చేసినట్లు కార్యనిర్వహణ అధికారి బాలాజీ తెలిపారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గీస భిక్షపతి, ఏఈఓ అంజయ్య ఆలయ ధర్మకర్తలు, బుచ్చిరెడ్డి, రఘువీరరెడ్డి ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, పోలీస్ సిబ్బంది, సిబ్బంది అంజయ్య, శ్రీనివాస్, మాధవి, శివరామ కృష్ణ భజన మండలి సభ్యులు పాల్గొన్నారు.