
ప్రకృతి వ్యవసాయంతో లాభాలు
కౌడిపల్లి(నర్సాపూర్): ప్రకృతి వ్యవసాయంతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఎన్‌ఏఏఆర్‌ఎం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ ఎం.బాలకృష్ణ తెలిపారు. గురువారం మండలంలోని డాక్టర్ డి.రామానాయుడు ఏకలవ్య గ్రామీణ వికాస ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)లో ఎస్సీ రైతులకు ప్రకృతి, సేంద్రియ వ్యసాయంపై శిక్షణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్‌ఏఏఆర్‌ఎం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రసాయన ఎరువుల వాడకం పెరిగిందని, దీంతో భూసారం తగ్గుతుందని తెలిపారు. రైతులు తప్పనిసరిగా ప్రకృతి, సేంద్రియ వ్యవసాయం చేయాలని సూచించారు. పశువులు, కోళ్లు ఎరువుతోపాటు జీవామృతం, బీజామృతం ఎరువులుగా వాడాలన్నారు. కార్యక్రమంలో కేవీకే హెడ్ అండ్ సైంటిస్ట్ శంభాజీ దత్తాత్రేయ, నల్కర్ కేవీకే శాస్త్రవేత్తలు రవికుమార్, శ్రీనివాస్, ప్రతాప్‌రెడ్డి, శ్రీకాంత్, ఉదయ్‌కుమార్, భార్గవితోపాటు రాయిలాపూర్, తునికి, పోతిరెడ్డిపల్లి గ్రామాలకు చెందిన 40మంది ఎస్సీ రైతులు పాల్గొన్నారు.
రైతుల శిక్షణలో సైంటిస్ట్ డాక్టర్ ఎం.బాలకృష్ణ