
బయో పాండ్‌లో చేపపిల్లల విడుదల
సిద్దిపేట జోన్ : పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని జంతుశాస్త్ర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బయో పాండ్‌లో 1500 చేపపిల్లలు వదిలినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ జి.సునీత తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ కళాశాలలో చదువుతున్న ఫిషరీస్, జంతుశాస్త్ర విద్యార్థులకు చిన్ననీటి వనరులలో చేపల పెంపకంపై అవగాహన కల్పిస్తామన్నారు. చేపలకు సరైన ఆహారం అందిస్తూ, వ్యాధుల నుంచి రక్షించడానికి అవసరమైన పద్ధతులను తెలుపుతూ అధిక రాబడి వచ్చే విధంగా అన్ని విషయాలను విద్యార్థులకు తెలుపుతామని చెప్పారు. కార్యక్రమంలో అధ్యాపకులు డా.ఎం.మధుసూదన్‌రెడ్డి, డా. జగదీశ్వరాచారి, రామ్‌కుమార్, చక్రవర్తి, వెంకటేశ్, విద్యార్థులు పాల్గొన్నారు.