
గణేశ్ గడ్డ హుండీ ఆదాయం రూ 28.17 లక్షలు
పటాన్‌చెరు టౌన్: రుద్రారం గ్రామపంచాయతీ పరిధిలోని గణేశ్‌గడ్డ దేవస్థానంలో హుండీ కానుకలను బుధవారం లెక్కించారు. దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ రంగారావు, ఆలయ ఈఓ లావణ్య సమక్షంలో లెక్కింపు జరిగింది. 105 రోజులకు గాను రూ.28 లక్షల 17 వేలు వచ్చినట్లు ఈఓ లావణ్య , జూనియర్ అసిస్టెంట్ ఈశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నదానం హుండీ ఆదాయం రూ.లక్షా ఇరవై వేలు వచ్చిందని, వచ్చిన ఆదాయాన్ని దేవాలయం అభివృద్ధికి వెచ్చించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అర్చకులు సంతోష్ జోషి, జగదీశ్వర్ స్వామి, చంద్రశేఖర్, అయ్యప్ప, సతీష్, పోలీసులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఆ పరిశ్రమలపై
చర్యలు తీసుకోవాలి
కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్
పటాన్‌చెరుటౌన్: భద్రతా చర్యలు పాటించని పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. సిగాచి పరిశ్రమలో గాయపడి పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని ధ్రువ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. చనిపోయిన వారి కుటుంబాలకు, క్షతగాత్రుల కుటుంబాలకు తగిన నష్టపరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వం చొరవ చూపుతుందన్నారు. పరిశ్రమలలో పనిచేసే కార్మికులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పరిశ్రమల యాజమాన్యాలపై ఉంటుందన్నారు.
రూ.కోటి పరిహారం ఇవ్వాలి
సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు
సంగారెడ్డి ఎడ్యుకేషన్: సిగాచి పరిశ్రమలో మృతి చెందిన కార్మిక కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం చెల్లించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రమాదంపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలన్నారు. పరిశ్రమల్లో తనిఖీలు నిర్వహించని అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. ప్రమాదంలో శాశ్వత వైకల్యం కల్గిన వారికి రూ.50 లక్షలు, గాయపడి, వారికి రూ10 లక్షలు చెల్లించాలన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్లేశం, నర్సింలు, జిల్లా కమిటీ సభ్యులు కష్ణ తదితరులు పాల్గొన్నారు.
‘సిగాచీ’ యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేయాలి
రామచంద్రాపురం(పటాన్‌చెరు): ప్రమాదానికి కారణమైన సిగాచీ పరిశ్రమ యాజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే.రాజయ్య డిమాండ్ చేశారు. బుధవారం రామచంద్రపురంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను ఆయన పరామర్శించారు. చికిత్స పొందుతున్న అనేక మంది కార్మికుల పరిస్థితి విషమంగా ఉందని వారిని వెంటనే మెరుగైన వైద్య సేవల కోసం నగరంలోని ప్రముఖ ఆసుపత్రులకు తరలించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం సైతం నష్టపరిహారాన్ని మరింత పెంచాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు మాణిక్యం, నాగేశ్వరరావు, మధు, జయరాం తదితరులు పాల్గొన్నారు.

గణేశ్ గడ్డ హుండీ ఆదాయం రూ 28.17 లక్షలు

గణేశ్ గడ్డ హుండీ ఆదాయం రూ 28.17 లక్షలు