
తరచూ గేట్ల మూసివేతతో ప్రజల అవస్థలు
రైలు వచ్చిన ప్రతిసారి గేట్లు మూసివేస్తుండడంతో దారిన వెళ్లే వాహన చోదకులు, ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జహీరాబాద్, కోహీర్‌ల మీదుగా హైదరాబాద్, సికిందరాద్‌ల నుంచి నాందేడ్, పూర్ణ, షిర్డీ, పర్లి, లాతూర్ ప్రాంతాలతో పాటు బెంగుళూరు, తిరుపతి, కాకినాడ ప్రాంతాలకు ఎక్స్‌ప్రెస్ రైళ్లు రాక పోకలు సాగిస్తున్నాయి. గూడ్స్ రైళ్లు సైతం ఎక్కువగా వచ్చి పోతుంటాయి. నిత్యం ఎంతో రద్దీగా ఉండే ఆయా మార్గాలలో రైలు వచ్చిన ప్రతిసారి గేట్లు మూసివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వికారాబాద్ నుంచి జహీరాబాద్, కోహీర్‌ల మీదుగా పర్లీ తదితర ప్రాంతాలకు అను నిత్యం 36 రైళ్ల వరకు రాక పోకలు సాగిస్తున్నాయి. దీంతో తరచూ రైల్వే గేటు మూసిఉంచడంతో ట్రాఫిక్ స్తంభించి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.