
ఇంటి నిర్మాణం కోసం అప్పులు చేసి..
తీర్చే మార్గం లేక ఆత్మహత్య
చేగుంట(తూప్రాన్): అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మక్కరాజీపేట గ్రామంలో చోటు చేసుకుంది. చేగుంట అదనపు ఎస్‌ఐ బిక్యానాయక్ వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన ఎరగొల్ల ఎల్లం(36) ఇంటి నిర్మాణం కోసం దాదాపు ఎనిమిది లక్షల అప్పు చేశాడు. తీర్చే మార్గం కనిపించక నిత్యం బాధపడుతుండేవాడు. ఈ క్రమంలో జూన్ 30న తన పొలం వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి ఇంటికి వచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు నార్సింగి ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం సుచిత్రలోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఎల్లం మంగళవారం మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఇంట్లో గొడవలతో మనస్తాపానికి గురై..
చికిత్స పొందుతూ బాలిక మృతి చెందింది. ఈ ఘటన మండల కేంద్రమైన మాసాయిపేటలో చోటు చేసుకుంది. గత నెల 12న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన విషయం విధితమే. ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన దొంతి అక్షయ(15) తల్లిదండ్రులు ఇంట్లో తరుచూ గొడవ పడుతుండేవారు. ఈ క్రమంలో ఇంట్లో గొడవలతో మనస్తాపానికి గురైన ఆమె గత నెల12న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన స్థానికులు చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అక్షయ మంగళవారం మృతి చెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కుటుంబ కలహాలతో యువకుడు
హవేళిఘణాపూర్(మెదక్): యువకుడు ఆత్మహత్య చేసున్నాడు. ఈ ఘటన మండల పరిధిలోని శమ్నాపూర్ గ్రామంలో మంగళవారం వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన జోగెల్లి కుమార్(34) కొంత కాలంగా మద్యం తాగి కుటుంబ సభ్యులతో గొడవపడుతున్నాడు. ఈ క్రమంలో సాయంత్రం కుమార్ తాగిన మైకంలో ఇంటికి వచ్చి తండ్రి పోచయ్యతో గొడవపడ్డాడు. క్షణికావేశంలో గ్రామ శివారులో ఉన్న గుట్టవద్దకు వెళ్లి చెట్టుకు ఉరి వేసుకున్నాడు. గమనించిన గ్రామస్తులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా అక్కడికి వెళ్లి చూసేలోపే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.
క్రిమి సంహారక మందు తాగి రైతు..
రామాయంపేట(మెదక్): అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్తుల కథనం మేరకు.. మండలంలోని సుతారిపల్లి గ్రామానికి చెందిన ఏర్పుల స్వామి (35)కి భార్య లావణ్యతోపాటు ముగ్గురు కుమారులున్నారు. తనకు ఉన్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అప్పులతో కొంత కాలంగా ఇబ్బందులు పడుతున్నాడు. రెండు రోజుల క్రితం క్రిమి సంహారక మందు తాగాడు. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ చికిత పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఈ విషయమై తమకు ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

ఇంటి నిర్మాణం కోసం అప్పులు చేసి..

ఇంటి నిర్మాణం కోసం అప్పులు చేసి..

ఇంటి నిర్మాణం కోసం అప్పులు చేసి..