
ఇంటర్ ప్రవేశాలు దరఖాస్తు గడువు పెంపు
పటాన్‌చెరు టౌన్: మహాత్మ జ్యోతి బాపూలే బీసీ గురుకుల కళాశాలలో ఇంటర్ ప్రవేశాలకు ఈ నెల 17 వరకు గడువు పొడిగించినట్లు పటాన్‌చెరు మండలం ముత్తంగి ప్రిన్సిపాల్ నవనీత సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.
కల్పనకు కాంస్య పతకం
మునిపల్లి(అందోల్): తమిళనాడులోని తిరుమ లైలో ఈనెల 9 నుంచి 12 వరకు జరి గిన హెచ్‌ఎఫ్‌ఐ హ్యాండ్‌బాల్ 40వ జాతీయ చాంపియన్‌షిప్ పోటీలో బుదేరా మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థిని బి.కల్పన కాంస్య పతకం సాధించింది. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ మాధవి, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ రమాదేవి సోమ వారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
‘తక్కువ నీటితో
పంటలు పండించాలి’
పటాన్‌చెరు టౌన్: రైతులు తక్కువ నీటితో పంటలు పండించాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సూచించారు. పటాన్‌చెరు మండలం కర్ధనూర్ గ్రామంలో మండల వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన సమావేశానికి సోమవారం రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు డాక్టర్ లక్ష్మిప్రసన్న, డాక్టర్ స్పందన పాల్గొని రైతులకు సూచనలు చేశారు.