
గంజాయి తరలిస్తున్న యువకుల అరెస్ట్
పటాన్‌చెరు టౌన్: అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పటాన్‌చెరు ఎకై ్సజ్ పోలీసులు పట్టుకున్నారు. సీఐ పరమేశ్వర్ గౌడ్ కథనం మేరకు.. పటాన్‌చెరు శివారు ఓఆర్‌ఆర్ సర్వీస్ రోడ్‌లో ఆదివారం రూట్ వాచ్ నిర్వహిస్తుండగా రెండు బైకుల్లో 1600 గ్రాముల గంజాయిని తీసుకెళ్తున్న ఆరుగురిని పట్టుకున్నారు. పట్టుబడిన వారు సంగారెడ్డికి చెందిన తునికి ఫణీంద్ర, వికారాబాద్‌కు చెందిన వికాస్, పటాన్‌చెరు మండలం క్యాసారం చెందిన సిరిపురం సంపత్, హైదరాబాద్ లాలాపేట్‌కు చెందిన ధనరాజ్, బొల్లారానికి చెందిన ఆంజనేయులు మహబూబ్‌నగర్‌కి చెందిన చాకలి బాలరాజుగా గుర్తించారు. పట్టుబడిన గంజాయి, ఐదు సెల్ ఫోన్‌లు, రెండు బైక్‌లను సీజ్ చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.