కొమురవెల్లి దేవాలయం | - | Sakshi
Sakshi News home page

కొమురవెల్లి దేవాలయం

May 10 2025 2:14 PM | Updated on May 10 2025 2:14 PM

కొముర

కొమురవెల్లి దేవాలయం

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం. సిద్దిపేట పాత బస్టాండ్‌ నుంచి 20 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ మల్లన్న పట్నం, బోనాలు చేయడం ప్రసిద్ధి. అనంతరం స్వామికి మొక్కులు చెల్లించుకుంటారు. భక్తు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. అలాగే సిద్దిపేట పట్టణంలో కోటి లింగాల దేవాలయం, వెంకటేశ్వర స్వామి దేవాలయం సైతం సందర్శించొచ్చు.

బోటింగ్‌..

చెరువులో బోటింగ్‌ను సైతం అందుబాటులో ఉంచారు. స్పీడ్‌ బోట్‌, సాధారణ బోట్‌లు ఉన్నాయి. స్పీడ్‌ బోట్‌లో నలుగురు ప్రయాణించే విధంగా, సాధారణ బోట్‌ 20 నుంచి 30 మంది వరకు ప్రయాణించవచ్చు. స్పీడ్‌ బోట్‌ అయితే నలుగురికి కలిపి రూ.350, అదే సాధారణ బోట్‌ అయితే ఒక్కరికి రూ.50 వసూలు చేస్తున్నారు.

వాటర్‌ షో..

చెరువులో వాటర్‌ షోను ఏర్పాటు చేశారు. ప్రతీ రోజు రాత్రి 7, 8 గంటలకు ఇలా రెండు వాటర్‌ షోలు జరుగనున్నాయి. పాటలతో జలదృశ్యం ఆవిష్కృతం అవుతుంది. కలర్‌ కలర్‌ లైట్‌లతో వాటర్‌ డ్యాన్స్‌ పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ షోను కూర్చుని వీక్షించే విధంగా ఏర్పాటు చేశారు.

జిగేల్‌... జిగేల్‌ నెక్లెస్‌ రోడ్‌

కోమటి చెరువు పై ఏర్పాటు చేసిన రూబీ నెక్లెస్‌ రోడ్డు పట్టణానికి మణిహారంగా నిలుస్తోంది. పచ్చదనం.. జిగేల్‌.. జిగేల్‌మనే విద్యుత్‌ కాంతులు ఎంతగానే ఆకర్షిస్తున్నాయి. వాకింగ్‌, సైక్లింగ్‌కు అనువుగా ఉండేందుకు సింథటిక్‌ ట్రాక్‌ను నిర్మించారు. రాత్రి సమయంలో ఒక వైపు విద్యుత్‌ కాంతులు.. మరో వైపు మానసిక ప్రశాంతత కోసం మ్యూజిక్‌ను ఏర్పాటు చేశారు. రూబీ నెక్లెస్‌ రోడ్‌ షూటింగ్‌ స్పాట్‌గా నిలుస్తోంది. ప్రీ వెడ్డింగ్‌, ప్రైవేట్‌ సాంగ్స్‌ చిత్రీకరించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వస్తున్నారు.

గ్లో గార్డెన్‌

కోమటి చెరువు సమీపంలో రెండు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన గ్లో గార్డెన్‌ మిరుమిట్లు గొలిపే అందాలతో ఆకర్షిస్తోంది. దేశంలోనే మొట్టమొదట గుజరాత్‌లోని సర్ధార్‌ వల్లాభాయ్‌ పటేల్‌ విగ్రహం వద్ద ఈ గ్లో గార్డెన్‌ను ఏర్పాటు చేశారు. అనంతరం సిద్దిపేటలోనే ఏర్పాటు చేయడం విశేషం. మెరిసే జంతువు, పక్షులు, చెట్ల బొమ్మలు ప్రజలను ఎంతో ఆకర్షిస్తున్నాయి. ఫాగ్‌ పాయింట్‌లోకి వెళ్తే మంచు కురిసే ప్రాంతానికి వెళ్లిన అనుభూతి కలుగుతుంది. డ్యాన్సింగ్‌ ఫ్లోర్‌లో చిన్నారులు డ్యాన్స్‌లు వేస్తుంటారు.

డైనో పార్క్‌..

కోమటి చెరువుకు పక్కనే 1.5 ఎకరాల విస్తీర్ణంలో డైనో పార్క్‌ను ఏర్పాటు చేశారు. డైనో పార్క్‌ అంటే ఏదో ఎగ్జిబిషన్‌లా బొమ్మలు, 3డీ యానిమేషన్‌ స్క్రీన్‌లు కాదు. అమెరికా, సింగపూర్‌లలోని యూనివర్సల్‌ వరల్డ్‌ స్టూడియోలో ఉన్న డైనో పార్క్‌ తరహాలో సిద్దిపేటలో ఏర్పాటు చేశారు. ఈ పార్క్‌ను కొండలు, గుహాల మాదిరిగా నిర్మించారు. గుహాలో ఓపెన్‌ ట్రైన్‌ను ఏర్పాటు చేశారు. ట్రైన్‌లో వెళ్తుంటే డైనోసార్‌ల అరుపులు, మీదకు వచ్చిన అనుభూతి కలుగుతుంది. ఒక్కసారిగా డైనోసార్‌లు మీదపడినట్లు, భీకరంగా అరవడం లాంటివి సౌండ్‌లు ఏర్పాటు చేశారు. దీనికి ఒక్కరికి రూ.50లు టికెట్‌ వసూలు చేస్తున్నారు.

స్కై సైక్లింగ్‌..

మీరు సాహస యాత్రలు చేయాలనుకుంటే అద్భుతమైన యాక్టివిటీ కోమటి చెరువులో ఉంది. ఇక్కడ స్కై సైక్లింగ్‌ను ఏర్పాటు చేశారు. గాలిలో రోప్‌ సాయంతో సైకిల్‌ చేసే విన్యాసం చూపరులను గగుర్పాటుకు గురి చేస్తుంది. ఇది ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఒక్కరికి రూ.50 రుసుంవసూలు చేస్తున్నారు.

కోమటి చెరువు

సిద్దిపేట పట్టణంలో కోమటి చెరువు కోటి అందాలతో పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోంది. సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో కోమటి చెరువును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దారు. సిద్దిపేట పాత బస్టాండ్‌ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో పర్యాటక ప్రాంతమైన కోమటి చెరువు ఉంది. చెరువు వద్ద మున్సిపాలిటీ, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఎంతో అభివృద్ధి చేశారు. ఈ చెరువుపై నిర్మించిన తీగల వంతెన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సుమారుగా 200 మీటర్ల దూరం ఉంటుంది. చెరువు మధ్యలో ఉన్నట్టుగా ఉంటుంది. దీనిపై ఒకేసారి 200 మంది నడిచే విధంగా తీర్చిదిద్దారు. వంతెనకు కలర్‌ లైట్‌లు ఏర్పాటు చేశారు. రాత్రి సమయంలో విద్యుత్‌ కాంతులతో ఆకర్శిస్తోంది. దీని రుసుము రూ.10 వసూలు చేస్తున్నారు.

కొమురవెల్లి దేవాలయం  
1
1/1

కొమురవెల్లి దేవాలయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement