
పిల్లలకు మంచి నడవడిక నేర్పించాలి
ఎమ్మెల్యే సంజీవరెడ్డి
నారాయణఖేడ్: అంగన్‌వాడీ కేంద్రాల్లో చదివే పిల్లలకు మంచి నడవడిక నేర్పించాలని ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి అంగన్‌వాడీ టీచర్లకు సూచించారు. ప్రభుత్వం మినీఅంగన్‌వాడీ టీచర్లను ప్రధాన అంగన్‌వాడీ టీచర్లుగా అప్‌గ్రేడ్ చేస్తూ వేతనాన్ని రూ.7,800 నుంచి రూ.13,650లకు పెంచిన నేపథ్యంలో శుక్రవారం ఖేడ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డివిజన్ పరిధిలోని అంగన్‌వాడీ కార్యకర్తలు ఎమ్మెల్యేను శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా సంజీవరెడ్డితోపాటు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం సంజీవరెడ్డి మాట్లాడుతూ...పిల్లల భవిష్యత్తుకు అంగన్‌వాడీ కేంద్రాలు దోహదపడాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో కొత్త విద్యాసంవత్సరం నుంచి నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులను నిర్వహించనున్నందున టీచర్లు పిల్లలపై ప్రత్యేక దృష్టిపెట్టి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని సూచించారు. అనంతరం పట్టణంలోని జూకల్ శివారులో నిర్మించిన డబుల్‌బెడ్‌రూం ఇండ్లను సంజీవరెడ్డి పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న వాటిని పూర్తిచేసి మిగిలిన శానిటరీ, విద్యుత్ వైరింగ్, తాగునీటి వసతి పనులను పూర్తిచేయాలని గుత్తేదార్లను ఆదేశించారు. కార్యక్రమంలో సీడీపీఓ సుజాత, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ దారంశంకర్, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.