
జొన్నలు కొనుగోలు చేయాలి
కల్హేర్(నారాయణఖేడ్): జొన్నలు కొనుగోలు చేయాలని మండలంలోని మార్డిలో గురువారం రైతులు ఆందోళనకు దిగారు. కల్హేర్, మార్డి, బీబీపేట్, కృష్ణాపూర్‌లో జొన్నలు కొనుగోలు చేయకపోవడంతో దాదాపు రెండు నెలలుగా ఇంట్లోనే నిల్వ ఉంచుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ గుర్రపు మశ్చేందర్ మాట్లాడుతూ...రైతులు పండించిన జొన్నలను కుప్పలుగా పోసి రాత్రి, పగలు కాపాడుకుంటున్నార న్నారు. ఎంపీ సురేశ్‌షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి చొరవ తీసుకుని జొన్నల కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కిష్టారెడ్డి, నాయకులు కుమ్మరి శ్రీనివాస్, నర్సింలు, విఠల్‌రెడ్డి పాల్గొన్నారు.