
బాధ్యతగా విధులు నిర్వర్తించాలి
సిద్దిపేటకమాన్: యూనిఫామ్ వేసుకున్న ప్రతీ ఒక్కరికి క్రమశిక్షణ ముఖ్యమని యూనిఫామ్‌లో ఉన్న వారిని పది మంది గమనిస్తూ ఉంటారని అది తెలుసుకొని బాధ్యతగా విధులు నిర్వహించాలని సీపీ సూచించారు. సిద్దిపేట పోలీసు కమిషనర్ కార్యాలయంలో హోంగార్డు సిబ్బందికి దర్బార్ నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. హోంగార్డ్స్ పోలీసు శాఖలో అంతర్గత భాగమే అన్నారు. హోంగార్డుల సంక్షేమానికి ఎల్లవేళలా కృషి చేస్తామన్నారు. ప్రతీ మూడు నెలలకోసారి దర్బార్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతీ పీఎస్‌లో పోలీసు సిబ్బందితో పాటు విధులు నిర్వహిస్తున్నారని, క్లిష్ట పరిస్థితుల్లో బందోబస్తు విధుల్లో చాలా సమర్థవంతంగా విధులు నిర్వహించారని ఇక ముందు కూడా అదే స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ సుభాష్ చంద్రబోస్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు ధరణి కుమార్, కార్తీక్, విష్ణుప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.
సిద్దిపేట సీపీ అనురాధ
హోంగార్డు సిబ్బందితో ‘దర్బార్’