
ఐపీఎల్ బెట్టింగ్ రాయుళ్ల అరెస్ట్
చేర్యాల(సిద్దిపేట): ఐపీఎల్ బెట్టింగ్ ఆడుతున్న నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలిపారు. మంగళవారం స్థానిక సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ ఎల్.శ్రీను వివరాలు వెల్లడించారు. పట్టణ పరిధి లోని చెరువు సమీపంలో కొందరు వ్యక్తులు ఐపీఎల్ బెట్టింగ్ ఆడుతున్నట్లు సమాచారం అందింది. సిద్దిపేట టాస్క్‌ఫోర్స్, చేర్యాల పోలీసులు వెళ్లి దాడి చేసి కమల్ల శ్రీనివాస్, కూరపాటి శివప్రసాద్, నర్ర చంద్రబాబు, ఎల్ల నవీన్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.76,400 నగదు, 4 మొబైల్ ఫోన్లు, 3 మోటార్ సైకిళ్లు స్వాధీ నం చేసుకుని కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు. మరికొంత మంది పారిపోయారని, త్వరలోనే వారిని పట్టుకుంటామన్నారు. సమావేశంలో చేర్యాల ప్రొబిషనరీ ఎస్‌ఐ సమత, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు.