
కొనుగోలు కేంద్రాల తనిఖీ
జిన్నారం (పటాన్‌చెరు): గుమ్మడిదల మున్సిపాలిటీలోని కొత్తపల్లి, కానుకుంట ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను డీఆర్డీఏ డీపీఎం జయశ్రీ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు రికార్డులను పరిశీలించారు. కేంద్రాల వద్ద జరుగుతున్న కొనుగోళ్లను తనిఖీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ...సకాలంలో ధాన్యాన్ని మిల్లులకు తరలించాలన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. కొత్తపల్లిలో 26 మంది రైతులు, 2,460లకుపైగా బస్తాలు, 984.80 క్వింటాళ్లు ధాన్యం నమోదు కాగా కానుకుంటలో 24 మంది రైతులు, 2,016 బస్తాలు, 842.80 క్వింటాళ్లు కొనుగోలు చేశారని తెలిపారు. కేంద్రం వద్ద రైతులకు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు.