
టైరు పేలి కారు బోల్తా
టేక్మాల్(మెదక్): అదుపుతప్పి కారు బోల్తా పడిన ఘటన టేక్మాల్ మండలంలోని బొడ్మట్‌పల్లి శివారులోని 161 హైవేపై సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. నారాయణఖేడ్ నుంచి హైదరాబాద్ వైపు కారు వేగంగా వెళ్తుండగా టైరు పగిలింది. దీంతో డివైడర్ అవతలి వైపునకి వెళ్లి రోడ్డుపై బోల్తా పడింది. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో కారులో ఉన్న ఇద్దరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వాహనం పూర్తిగా దెబ్బంతి. హైవే సిబ్బంది రోడ్డుపై నుంచి కారును తొలగించారు.
బోల్తా పడిన బైక్
టేక్మాల్ మండలంలోని కాద్లూర్ శివారులో అదుపుతప్పి బైక్ బోల్తా పడింది. స్థానికుల కథనం మేరకు.. రేగోడు మండలం మర్పల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మెదక్ వైపు నుంచి బొడ్మట్‌పల్లి వైపునకు బైక్‌పై వస్తుండగా అదుపుతప్పి బోల్తా పడ్డాడు. అతివేగంగా, అజాగ్రత్తగా రావడంతోనే ప్రమాదం చోటు చేసుకుంది. వ్యక్తికి తలకు తీవ్రగాయాలు కావడంతో అంబులెన్స్‌లో జోగిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.