జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలకు మద్దూరు యువకుడు | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలకు మద్దూరు యువకుడు

May 6 2025 10:09 AM | Updated on May 6 2025 10:09 AM

జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలకు మద్దూరు యువకుడు

జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలకు మద్దూరు యువకుడు

మద్దూరు(హుస్నాబాద్‌): సౌత్‌జోన్‌ జాతీయ స్థాయి హ్యాండ్‌ బాల్‌ టోర్నమెంట్‌కు మండల కేంద్రానికి చెందిన బేజాడి కార్తీక్‌ గౌతమ్‌రెడ్డి ఎంపికై నట్లు మెదక్‌ జిల్లా హ్యాండ్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి విజయ్‌బాబు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి హ్యాండ్‌బాల్‌ సెలక్షన్‌ పోటీల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబర్చినట్లు తెలిపారు. 9 నుంచి 12 వరకు తమిళనాడు రాష్ట్రంలో జరిగే టోర్నమెంట్‌ రాష్ట్ర జట్టు తరఫున పాల్గొనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గౌతమ్‌ రెడ్డిని సిద్దిపేట జిల్లా అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కందుకూరి ఉపేందర్‌గుప్తా, దామెర మల్లేశం, జిల్లా హ్యాండ్‌ బాల్‌ అసోసియేషన్‌ సభ్యులు అభినందించారు.

తాళం వేసిన ఇంట్లో చోరీ

టేక్మాల్‌(మెదక్‌): తాళం వేసిన ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన మండలంలోని సంగ్యాతండా పంచాయతీ పరిధిలోని కడిలాబాయి తండాలో సోమవారం చోటు చేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. తండాకు చెందిన కున్‌సోత్‌ మోహన్‌ కుటుంబ సభ్యులు ఉదయం ఇంటికి తాళం వేసి వ్యవసాయ పనులతోపాటు ఉపాధి హామీ పనులకు వెళ్లారు. పనులు ముగించుకొని ఇంటికొచ్చే సరికి గుర్తు తెలియని దుండగులు తాళం పగులగొట్టి ఇంట్లో చొరబడ్డారు. బీరువాలోని తులం బంగారం, 35 తులాల వెండి, రూ.15 వేల నగదు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

కారు, బైకు ఢీ : ఒకరు మృతి

పెద్దశంకరంపేట(మెదక్‌): కారు, బైకు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన పెద్దశంకరంపేట శివారులో చోటు చేసుకుంది. అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి, ట్రైనీ ఎస్‌ఐ అరవింద్‌ కథనం మేరకు.. భీమన్నపల్లి మురళీ క్రిష్ణ(32), అంజన్నగారి హరీశ్‌ పెద్దశంకరంపేట వైపు నుంచి మల్కాపూర్‌ వైపు బైక్‌పై వెళ్తున్నారు. మార్గమధ్యలో రేగోడ్‌ వైపు నుంచి పేట వైపు వస్తున్న కారు ఢీకొట్టడంతో మురళీక్రిష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. హరీశ్‌కు తీవ్ర గాయాలు కావడంతో సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు.

ఇద్దరు మహిళలు అదృశ్యం

ఇంటి నుంచి వెళ్లి..

శివ్వంపేట(నర్సాపూర్‌) : ఇంటి నుంచి వెళ్లి మహిళ అదృశ్యమైంది. ఎస్‌ఐ మధుకర్‌రెడ్డి కథనం మేరకు.. మండల పరిధి పోతులబోగూడ గ్రామానికి చెందిన బత్తులు లక్ష్మీ (58) గత నెల 24న పాంబండలో జరిగిన బంధువుల పెళ్లికి వెళ్లింది. రెండు రోజుల ద్వారా ఇంటికొస్తానని చెప్పడంతో కుటుంబ సభ్యులు గ్రామానికి వెళ్లిపోయారు. 26న కుటుంబ సభ్యులు పాంబండలో ఉన్న బంధువులకు లక్ష్మీ గురించి ఫోన్‌ చేయగా ఉదయమే పోతులబోగూడకి బయలుదేరిందని చెప్పారు. ఇంటికి రాకపోవడంతో పలు చోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. లక్ష్మీ కుమారుడు నాగులు సోమవారం ఇచ్చిణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

కుటుంబ కలహాలతో..

గజ్వేల్‌రూరల్‌: కుటుంబ కలహాలతో వివాహిత అదృశ్యమైన ఘటన సోమవారం చోటు చేసు కుంది. పోలీసుల కథనం మేరకు.. గజ్వేల్‌కు చెందిన జర్రు శారద భర్త చనిపోవడంతో ఏడాది కిందట ప్రమోద్‌ అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకుంది. దంపతుల మధ్య గొడవలు జరుగుతుండటంతో మనస్తాపానికి గురై ఇంటి నుంచి వెళ్లిపోయి తల్లిదండ్రులకు ఫోన్‌ ద్వారా సమాచారం అందించింది. శారద కోసం తల్లిదండ్రులు తెలిసిన చోట వెతికినప్పటికీ ఆచూకీ లభించలేదు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement