
గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
జహీరాబాద్ టౌన్: కుల, మత భేదాలు లేని సమాజ స్థాపనకు కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త విశ్వగురువు బసవేశ్వరుడని కర్నాటక రాష్ట్రంలోని బీదర్ ఎమ్మెల్యే శైలేంద్ర బెళదాళే అన్నారు. జహీరాబాద్ లింగాయత్ సమాజ్, అనుభవ మండపం కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన శరణ తత్వ ప్రవచన మహోత్సవాల ముగింపు కార్యక్రమం శనివారం రాత్రి బసవ ఫంక్షన్‌హాల్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా బసవేశ్వరుడి ప్రవచనాలు అందరికీ ఆదర్శనీయమన్నారు. డీసీఎంఎస్ ఉమ్మడి మెదక్ జిల్లా చైర్మన్ ఎం.శివకుమార్ మాట్లాడుతూ బసవేశ్వరుడి బోధనలను ఆచరిస్తూ సమసమాజ నిర్మాణం కోసం అందరం కృషి చేయాలన్నారు. సామాజిక ఉద్యమకారుడు ఢిల్లీ వసంత్ మాట్లాడుతూ సామాజిక సమభావన, అంటరానితనం, లింగ, కుల వివక్షతలను రూపుమాపడంలో బసవేశ్వరుడు కృషి చేశారని కొనియాడారు. నెలపాటు ప్రవచనాలు చెప్పిన లింగమూర్తి స్వామిజీ సన్మానించారు. కార్యక్రమంలో లింగాయత్ సమాజ్ అధ్యక్షుడు రాజశేఖర్ షెట్కార్, ప్రధాన కార్యదర్శి ఆర్.సుభాష్ పాల్గొన్నారు.
బీదర్ ఎమ్మెల్యే శైలేంద్ర
