
మాట్లాడుతున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్‌చెరు: సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం పటాన్‌చెరు మండలం పాటి గ్రామ శివారులోని ఓ ఫంక్షన్ హాలులో నిర్వహించిన మండల స్థాయి పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు. రాబోయే రోజుల్లో అవలంబించాల్సిన విధి విధానాలపై పార్టీ శ్రేణులకు దిశ నిర్దేశం చేశారు. కార్యకర్తలకు పార్టీ రుణపడి ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. ప్రతి గ్రామంలో ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. ప్రభుత్వం అందించే నిధులతోపాటు సీఎస్‌ఆర్ నిధులతో ప్రతి గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. పరిపాలన వికేంద్రీకరణకు పెద్దపీటవేసిన మహోన్నత నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రజలు తెలివైన వారని, కులం మతం పేరుతో విద్వేష రాజకీయాలకు పాల్పడుతున్న బీజేపీని తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. నియోజకవర్గంలో ఒక్క గుడికి సున్నం వేయని బీజేపీ నాయకులు నేడు హిందూ మతానికి ప్రతినిధుల మని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. లౌకిక వాదానికి పెద్దపీటవేస్తూ నియోజకవర్గంలో 170కి పైగా గుడులు, మసీదులు, ఆశిర్ఖానాలు, దర్గాలు చర్చిలను నిర్మించినా ఎప్పుడూ ప్రచార అర్బాటాలకు తావివ్వలేదన్నారు. ఓటు అడిగే నైతిక హక్కు ప్రతిపక్షాలకు లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుష్మాశ్రీ, జెడ్పీటీసీ సుప్రజా, పార్టీ మండల అధ్యక్షుడు పాండు, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే సతీమణి గూడెం యాదమ్మ మహిపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పాలక వర్గం ప్రతినిధులు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు.