
రాజీవ్‌చౌక్‌లో దీక్ష చేస్తున్న సురేశ్ షెట్కార్
నారాయణఖేడ్: రాహుల్‌గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని నిరసిస్తూ నారాయణఖేడ్‌లోని రాజీవ్‌చౌక్‌లో టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్ ఆధ్వర్యంలో, మరో టీపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్ సంజీవరెడ్డి ఆధ్వర్యంలో తన స్వగృహం ఎదుట వేర్వేరుగా నిరసన దీక్షలు చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్షలు కొనసాగాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీరును తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజలకు అందాయని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్‌కు ప్రజల్లో రోజురోజుకు పెరుగుతున్న ఆదరణను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీర్ణించుకోలేకపోతున్నాయని పేర్కొన్నారు. సురేశ్ షెట్కార్ ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షలో టీపీసీసీ సభ్యుడు శంకరయ్యస్వామి, కర్నె శ్రీనివాస్, నాయ కులు నగేశ్‌షెట్కార్, జితేంద్రనాథ్ షెట్కార్, సాగర్ షెట్కార్ తదితరులు పాల్గొనగా డాక్టర్ సంజీవరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన దీక్షలో ముఖ్య నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, దారం శంకర్, రాజేశ్‌చౌహాన్, అశోక్‌రెడ్డి, శంకర్ ముదిరాజ్ పాల్గొన్నారు.
మరో ఆరుగురికి కరోనా
పటాన్‌చెరు టౌన్: పటాన్‌చెరు పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయి. మంగళవారం 31 మందికి కోవిడ్ ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా అందులో ఆరుగురికి పాజిటివ్ వచ్చినట్లు టెస్టుల నిర్వాహకుడు మనోహర్ తెలిపారు. అదేవిధంగా ఆర్టీపీసీఆర్ టెస్టులు 23 మందికి నిర్వహించినట్లు పేర్కొన్నారు.