సంగారెడ్డి టౌన్: రోడ్డుప్రమాదంలో గుర్తు తెలియనివ్యక్తి మృతి చెందాడు. సంగారెడ్డి రూరల్ పోలీసుల కథనం ప్రకారం..మంగళవారం ఉదయం సంగారెడ్డి పెప్సీ ఫ్లైఓవర్ వద్ద గుర్తు తెలియనివ్యక్తిని ఓ వాహనం ఢీకొనగా బలమైన గాయాలు అయ్యాయి. వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి వయసు 25 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉంటుందని, ఎరుపురంగు బనియన్, నలుపురంగు పాయింట్ ధరించాడని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చూరీలో భద్రపరిచామని, వివరాలు తెలిస్తే...8712656719, 8712656746, 8919785080 నంబర్లలో సంప్రదించాలన్నారు.