
రావుల లచ్చమ్మ (ఫైల్)
బెజ్జంకి(సిద్దిపేట): ఉపాధిహామీలో భాగంగా కూలిపనికి వెళ్లిన ఓ మహిళ మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. రోజుమాదిరిగానే మంగళవారం బెజ్జంకి శివారులోని పాపన్నపల్లెలో ఉపాధిపనికి తట్ట, పార తీసుకుని రావుల లచ్చవ్వ (55) వెళుతుండగా, ఒక్కసారిగా కళ్లు తిరిగి కింద పడింది. వెంటనే కరీంనగర్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించగా, లచ్చవ్వ అప్పటికే మృతి చెందింది. మృతురాలి కుమారుడు నర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు హెడ్‌కానిస్టేబుల్ కొంరయ్య తెలిపారు. సంఘటన స్థలాన్ని ఏపీడీ ఓబులేష్, ఎంపీడీఓ రాములు పరిశీలించారు. అక్కడే ఉన్న కూలీలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.