
రామచంద్రాపురం(పటాన్‌చెరు): ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెల్లాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ మల్లేపల్లి లలిత సోమిరెడ్డి అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్‌నగర్‌లో మిషన్ భగీరథ పైపులైన్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. ప్రజల మధ్యలో ఉంటూ సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చిట్టి, నైబర్‌హుడ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఈశ్వరగారి రమణ, నాయకులు ఉమేష్‌లు పాల్గొన్నారు.