అన్నా తమ్మీ | - | Sakshi
Sakshi News home page

అన్నా తమ్మీ

Dec 3 2025 10:09 AM | Updated on Dec 3 2025 10:09 AM

అన్నా

అన్నా తమ్మీ

బుధవారం శ్రీ 3 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

న్యూస్‌రీల్‌

ఇదీ వరుస

బుధవారం శ్రీ 3 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

హలో..

షాద్‌నగర్‌/షాబాద్‌: పంచాయతీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు అన్ని అస్త్రాలు సంధిస్తున్నారు. వార్డులన్నీ జల్లెడ పడుతున్నారు. కనిపించినవారినల్లా ఆత్మీయంగా పలుకరిస్తున్నారు. ఏకంగా వరుసలు కలిపేస్తూ ఓట్ల గాలం వేస్తున్నారు. కచ్చితంగా తమకు పడే ఓట్లు ఎన్ని.. మిగతా వారు ఎవరు చెబితే వింటారు అన్నదానిపై వాకబు చేస్తున్నారు. ఏ ఒక్క ఓటునూ వదలకూడదని ఓటర్ల జాబితా ముందేసుకుని మరీ ఎక్కడ ఉన్నారో వెతికేస్తున్నారు. చిరునామా, ఫోన్‌ నంబర్‌ తెలుసుకునే పనిలో పడ్డారు. గ్రామీణ ప్రాంతాలను వదలి ఉద్యోగాలు, ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారికి ఫోన్లు చేసి.. వరుసలు కలిపేసి.. మాటలతో మస్కా కొడుతున్నారు. ఇంతకాలం తాము ఎక్కడ ఉన్నామో.. ఏమైపోయామో కూడా పట్టించుకోని వారు ఒక్కసారిగా ఫోన్లు చేసి ఆప్యాయంగా పలుకరిస్తుండడంతో ఆశ్చర్చపోవడం ఓటర్ల వంతవుతోంది.

ఇదీ వలస

ప్రతి గ్రామ నుంచి వందల సంఖ్యలో జనం వివిధ పనుల నిమిత్తం వలస పోయారు. ముఖ్యంగా తండావాసులు ముంబైలాంటి ప్రాంతాలకు వెళ్లి కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. ఇక వివిధ ఉద్యోగాల నేపథ్యంలో చాలా మంది హైదరాబాద్‌తోపాటు వివిధ ప్రాంతాలకు ఉపాధి వెతుక్కుంటూ వెళ్లారు. మరోవైపు చాలా మంది తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించుకునేందుకు నగరాలకు వెళ్లారు. ఒక్కో పల్లె నుంచి కనీసం 30 శాతం మంది ఇలా వేరే ప్రాంతాలకు జీవనాన్ని వెతుక్కుంటూ వెళ్లిన వారే. వీళ్ల ఓట్లు మాత్రం ఇప్పటికీ గ్రామాల్లోనే ఉన్నాయి. ఒక్కో గ్రామంలో అభ్యర్థుల గెలుపు, ఓటములను శాసించగలిగే స్థాయిలో బయట ఓట్లు ఉండడంతో చాలామంది అభ్యర్థులు వీటిపై ఫోకస్‌ పెట్టారు.

హలో.. అన్నా.. నేనే.. గుర్తుపట్టినవా.. బాగున్నావె.. ఎన్ని రోజులైందే కలవక.. వారం రోజుల సంది నిన్ను యాదిజేస్తున్నా.. నా తానున్న నంబర్‌ కలుస్తలే.. మనోళ్ల దగ్గర అడిగి ఈ నంబర్‌ తీసుకున్న.. పిల్లలు, మీరంతా మంచిగున్నరా.. ఏంలేదన్నా.. నేను మనూళ్ల సర్పంచ్‌గా నిలబడిన.. నువ్వు, వదిన వచ్చి ఓటెయ్యాలె.. జర యాది మర్చిపోవద్దే..

ఏం తమ్మీ ఎట్లున్నవ్‌.. మంచిగున్నవా.. అసలు గీమధ్య ఊరి దిక్కే రాకుండా అయినవ్‌.. ఎప్పుడొస్తావ్‌.. నీ ఓటు గీడనే ఉన్నది తెలుసు కదా.. ఓటేసేందుకు వస్తున్నావ్‌ కదా.. తప్పకుండా రావాలె తమ్మీ.. మీ అన్నను గెలిపియ్యాలె..

అక్కా బాగున్నవా.. బావగిన్న మంచిగుండా.. పిల్లలు ఏం సదువుతుండ్రు.. మీ ఈ తమ్ముడు సర్పంచ్‌గా పోటీ చేస్తున్నడు.. మీ ఆశీస్సులుండాలె.. తప్పకుండా అందరూ ఓట్ల రోజు ఊరికి రావాలె.. నీ తమ్ముడిని గెలిపించుకోవాలె..

ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లకు వరుసబెట్టి ఫోన్లు కొడుతున్నారు. ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నిత్యం ఇదో పనిగా పెట్టుకున్నారు. కొందరైతే మరో అడుగు ముందుకేసి నేరుగా వాళ్లు ఉన్నచోటికే వెళ్లి కలిసి కచ్చితంగా గ్రామానికి వచ్చి ఓటు వేయాలని కోరుతూ రవాణా ఖర్చులకోసమంటూ చేతిలో ఎంతోకొంత పైసలు పెట్టి వెళ్తున్నారు. రాష్ట్రాలు దాటి వెళ్లిన వారికి ఆన్‌లైన్‌ చెల్లింపులు సైతం చేస్తున్నారు. గ్రామాల్లో ఉన్న పెద్ద మనుషుల ద్వారా చెప్పించడం, నేతల ద్వారా మాట్లాడించడం వంటివి కూడా చేస్తున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులంతా వరుసగా ఫోన్లు చేస్తుండడంతో ఎవరికి ఓటు వేయాలో అర్థం కాక ఓటర్లు అయోమయంలో పడుతున్నారు. మరి ఎంతమంది గ్రామాలకు వస్తారో.. ఎందరు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారో వేచి చూడాలి.

అన్నా తమ్మీ 1
1/3

అన్నా తమ్మీ

అన్నా తమ్మీ 2
2/3

అన్నా తమ్మీ

అన్నా తమ్మీ 3
3/3

అన్నా తమ్మీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement