
నిధుల దుర్వినియోగంపై ఆగ్రహం
షాద్‌నగర్‌రూరల్: పట్టణంలోని పద్మావతీకాలనీలో ఉన్న పోస్టాఫీస్‌లో నిధుల దుర్వినియోగంపై బుధవారం ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. పోస్టల్ శాఖకు సంబంధించిన రూ.19 లక్షల నిధులు ఖాతాలో జమ చేయకుండా స్థానిక పోస్టల్ ఉద్యోగి దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై అధికారులు కదిలారు. వనపర్తి పోస్టల్ ఆఫీస్ సూపరింటెండెంట్ భూమన్న, అధికారులు సైదానాయక్, గోపీనాథ్, సుజన్ నాయక్, రవికుమార్‌లు షాద్‌నగర్‌కు విచ్చేసి కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేశారు. ఇందులో పోస్టల్‌శాఖకు సంబంధించిన రూ.19లక్షల డబ్బులు లేకపోవడంతో స్థానిక అధికారి ఉమామహేశ్వర్‌పై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు ఎక్కడ ఉన్నాయని స్థానిక అధికారిని ప్రశ్నించడంతో డబ్బులు ఇంటి వద్ద ఉన్నాయని చెప్పారు. దీంతో రెండు రోజుల్లో డబ్బులు మొత్తం ఖాతాలో జమ చేయాలని లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పోస్టాఫీస్‌లో తనిఖీ చేసిన అధికారులు