
నేడు అధికారులకు ప్రత్యేక శిక్షణ
ఆమనగల్లు: పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో సమావేశ మందిరంలో గురువారం అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు పంచాయతీ అడ్వాన్స్‌మెంట్ ఇండెక్స్, స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంపై శిక్షణ నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ కుసుమ మాధురి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు హాజరవాలని కోరారు.
డాక్టర్ సరితకు
‘వైద్య శిరోమణి’
షాద్‌నగర్: షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రిలో చిన్నపిల్లల వైద్యురాలిగా పనిచేస్తున్న డాక్టర్ సరితను వైద్య శిరోమణి అవార్డు వరించింది. వివిధ రంగాల్లో ఉత్తమ సేవలందించిన వారికి బుధవారం నగరంలోని రవీంద్రభారతిలో నవకళా వేదిక ఆధ్వర్యంలో అవార్డులు ప్రదానం చేశారు. కోవిడ్ సమయంలో జిల్లా ఆస్పత్రితో పాటు కిమ్స్ ఆస్పత్రిలో చిన్నారులకు వైద్యం అందించిన డాక్టర్ సరితను వైద్య శిరోమణి అవార్డుకు ఎంపిక చేశారు. మాజీ స్పీకర్ మధుసూదనాచారి చేతుల మీదుగా ఆమెకు అవార్డు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవులు, బీసీ కమిషన్ సభ్యుడు తిరుమలగిరి సుందరం, దైవజ్ఞ శర్మ పాల్గొన్నారు.
షాద్‌నగర్‌కు మాజీ మంత్రి
షాద్‌నగర్: పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్న మైనార్టీ నేత అంజద్ ఘోరి నివాసానికి బుధవారం మాజీ హోంమంత్రి మహమూద్ అలీ విచ్చేశారు. ఇటీవల అంజద్‌గోరి కుమారుడి వివాహం జరిగిన నేపథ్యంలో శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం ముస్లిం మైనార్టీ నాయకులు మహమూద్ అలీని ఘనంగా సన్మానించారు.
యూజీడీ నిర్మాణానికి వినతి
షాద్‌నగర్: భగత్‌సింగ్ కాలనీలో డ్రైనేజీ నిర్మించాలని కాలనీ వాసులు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను కోరారు. ఈ మేరకు బుధవారం వారు క్యాంపు కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందజేశారు. రామకృష్ణ థియేటర్, కటిక కేరి, పద్మావతీ కాలనీల నుంచి వచ్చే మురుగు నీరు భగత్‌సింగ్ కాలనీ మీదుగా వెలుతోందని.. వర్షాలు కురిస్తే డ్రైనేజీ పొంగి ఇళ్లలోకి మురుగు వస్తుందన్నారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు స్పందించిన ఎమ్మెల్యే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో మాజీ కౌన్సిలర్ సరిత, యాదగిరి యాదవ్, కాలనీ వాసులు వెంకటేశ్ యాదవ్, రోమియో రమేశ్, మహేందర్, శ్రీనివాస్, నర్సింలు తదితరులు ఉన్నారు.
జాతీయ సదస్సుకు కొత్తూరు మున్సిపల్ చైర్‌పర్సన్
కొత్తూరు: హర్యానా రాష్ట్రం గురుగ్రామ్ పట్టణంలో నిర్వహించనున్న జాతీయ స్థాయి సదస్సుకు మున్సిపల్ చైర్‌పర్సన్ లావణ్య, వైస్ చైర్మన్ డోలి రవీందర్‌కు ఆహ్వానం అందింది. బుధవారం మున్సిపల్ చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. ‘రాజ్యాంగ ప్రజాస్వామ్యం, దేశనిర్మాణంలో పట్టణ, స్థానిక సంస్థల పాత్ర’అనే అంశంపై జాతీయ స్థాయి సదస్సు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాలు, పట్టణాలు, స్థానిక సంస్థల చైర్మన్లు పాల్గొంటారని చెప్పారు. ఈ మేరకు తమకు మున్సిపల్ పరిపాలన విభాగం నుంచి సమాచారం వచ్చిందని చెప్పారు.

నేడు అధికారులకు ప్రత్యేక శిక్షణ

నేడు అధికారులకు ప్రత్యేక శిక్షణ