
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు
● ఘన స్వాగతం
మహేశ్వరం: మండల కేంద్రంలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ తయారీ పరిశ్రమను ప్రారంభించడానికి గురువారం విచ్చేసిన సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు స్థానిక కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. శాలువాలు, పూలమాలలు, గజమాలలతో సత్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, పీసీసీ జనరల్ సెక్రటరీ ఏనుగు జంగారెడ్డి, పీసీసీ సభ్యుడు దేప భాస్కర్‌రెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ కోరుపోలు రఘుమారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సబావత్ కృష్ణ నాయక్, వైస్ చైర్మన్ చాకలి యాదయ్య, ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ నందిగామ నర్సింహ తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం: విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దని, ఉన్నతాధికారుల సూచనలు, సలహాల ప్రకారం పనులు వేగవంతంగా పూర్తి చేయాలని డివిజినల్ లెవల్ పంచాయతీ అధికారి సాధన అన్నారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం పంచాయతీ అడ్వాన్స్‌మెంట్ ఇండెక్స్–2025, స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్, ఇందిరమ్మ ఇళ్లు, వన మహోత్సవం, సిటీజన్ సర్వీస్ తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పంచాయతీల్లో మౌలిక సదుపాయాలు, చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల కార్యక్రమాల వివరాలను ఆయా శాఖల అధికారులు సోమవారం లోగా అందజేయాలన్నారు. వన మహోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేయాలని సూచించారు. కాగా తమకు మూడు నెలలుగా వేతనాలు అందడంలేదని ఉపాధి హామీ టెక్నికల్, ఫీల్డ్ అసిస్టెంట్లు సమావేశాన్ని బహిష్కరించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎంపీడీఓ యెల్లంకి జంగయ్యగౌడ్, ఎంపీఓ రఘు, మండల వ్యవసాయాధికారిణి విద్యాధరి, మండల విద్యాధికారి హీర్యానాయక్, వైద్యాధికారులు మంజుల, సరిత, ఎస్‌ఐ నాగరాజు, మండల పీఆర్, ఆర్‌డబ్ల్యూఎస్, హౌసింగ్ ఏఈలు ఉస్మాన్, రజిత, వైష్ణవి తదితరులు పాల్గొన్నారు.

విధి నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు