
యంగ్ ఎర్త్ లీడర్ ప్రోగ్రాం పనులు షురూ
కందుకూరు: డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ పర్యావరణ సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న యంగ్ ఎర్త్ లీడర్ ప్రోగ్రాంలో భాగంగా నేదునూరు పరిధిలోని మోడ ల్ స్కూల్‌లో గురువారం పనులు ప్రారంభించారు. వర్షపు నీరు ఇంకేలా పిట్ తవ్వకంతో పాటు ఔషధ మొక్కల పెంపకం కోసం స్థలాన్ని జేసీబీ యంత్రంతో సిద్ధం చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ విష్ణుప్రియ మాట్లాడుతూ.. పాఠశాల ఆవరణలో ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టడంతో వర్షం నీరు ఇంకి భూగర్భ జలాలు పెరగడానికి దోహదపడుతుందన్నారు. ఔషధ మొక్కల పెంపకం చేపట్టి విద్యార్థులకు అవగాహన కల్పిస్తే వాళ్లు ఇళ్ల వద్ద పెంచుకోవడానికి ఆసక్తి చూపుతారన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పుష్పలత, గురురాజారెడ్డి, సీజీఆర్ సంస్థ కోఆర్డినేటర్ రజనీకాంత్, ఎర్త్ లీడర్స్ హానిప్రియ, మధీహ, విజయదుర్గ, తేజస్విని, తరుణి, మాధవి, శ్రీకర్, హాసిని పాల్గొన్నారు.