
తీరని దాహం
మున్సిపాలిటీల్లో తాగునీటి కటకట
● ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయక ఇక్కట్లు
● శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్న మున్సిపల్ వాసులు
ట్యాంకర్లే ఆధారం
చేవెళ్ల: చేవెళ్ల మున్సిపాలిటీలో 12 గ్రామాలు విలీనమయ్యాయి. ఇక్కడ మిషన్ భగీరథ నీరే ప్రధాన వనరు. నీటి సరఫరాలో ఆటంకాలు ఎదురైనప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మిషన్ భగీరథ పైప్‌లైన్ పగిలి పోవడంతో నాలుగు రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. గతంలో ఉన్న బోరుబావులకు మోటార్లు బిగించి అవసరమైన సమయాల్లో నీరు వదలాలని మున్సిపల్ వాసులు కోరుతున్నారు. వేసవిలో ప్రణాళికలు సిద్ధం చేసిన అధికారులు మోటార్ల ఏర్పాటుకు కృషి చేస్తామంటున్నారు.