
నిధులున్నా.. పనులు సున్నా
ఆమనగల్లు: మున్సిపల్ పరిధిలో కొన్ని కాలనీలకు మిషన్ భగీరథ నీరు సరఫరా కావడం లేదు. మున్సిపల్ పరిధిలో దాదాపు 20 వేల జనాభా ఉండగా ప్రతిరోజు 25 లక్షల లీటర్ల నీరు అవసర పడుతుంది. మిషన్‌భగీరథ పథకం ద్వారా ప్రతిరోజూ 20 లక్షల లీటర్ల నీరు మాత్రమే సరఫరా అవుతుంది. మిగతా నీటిని మున్సిపాలిటీ పరిధిలో ఉన్న బోర్లద్వారా ప్రజలకు అందిస్తున్నారు. పట్టణంలోని విద్యానగర్ కాలనీ వాసులు మిషన్ భగీరథ నీరు సరఫరాకు ఏళ్ల నుంచి విన్నవిస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. నూతనంగా ఏర్పడిన కాలనీల్లో నల్లా కనెక్షన్ లేక సొంత బోర్ల నీటినే వాడుకుంటున్నారు. పట్టణంలో నూతన పైప్‌లైన్ నిర్మాణం, తాగునీటి కల్పనకు కేంద్ర ప్రభుత్వం రూ.32 కోట్లు మంజూరు చేసినప్పటికీ ఇప్పటివరకు పనులు ప్రారంభించలేదు. ఇప్పటికై నా మున్సిపాలిటీ అధికారులు స్పందించి అన్ని కాలనీలకు నీరు అందించాలని కోరుతున్నారు.
మిషన్ భగీరథ నీరు అందించాలి
ఆమనగల్లు పట్టణంలోని విద్యానగర్ కాలనీకి మిషన్ భగీరథ నీరు అందించాలి. మిషన్‌భగీరథ నీరు అందించాలని ప్రజాప్రతినిధులు, అధికారులను ఏళ్ల నుంచి కోరుతున్నాం. ఇంతవరకు అందించలేదు. కాలనీలో ఉన్న బోర్లద్వారానే నీటిని వాడుకుంటున్నాం.
– పాషా, విద్యానగర్ కాలనీ అధ్యక్షుడు