
పైప్‌లైన్లు, ఎయిర్‌వాల్వ్ లీకేజీలు
తుక్కుగూడ: మున్సిపల్ పరిధిలోని తాగునీటి సమస్య వేధిస్తుంది. ఔటర్ రింగు రోడ్డు లోపల భాగం తుక్కుగూడ, రావిర్యాల, సర్ధార్‌నగర్, దేవేందర్‌నగర్ కాలనీలకు హెచ్‌ఎండబ్ల్యూస్ ఆధ్వర్యంలో, ఔటర్ ఆవలి భాగంలో ఉన్న మంఖాల్, ఇమూమ్‌గూడ గ్రామాలకు మిషన్ భగీరథ ఆధ్వర్యంలో నీటి పంపిణీ జరుగుతుంది. ఈ రెండు శాఖల నీటి సరఫరా అవసరం మేరకు పంపిణీకాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. పైపులైన్లు, ఎయిర్‌వాల్వ్ లీకేజీల కారంగా నీరు వృథా అవుతుంది. దీంతో ప్రజలు వీధుల్లో ఉన్న బోర్లను ఆశ్రయిస్తున్నారు.