
రైతులకు అండగా కాంగ్రెస్
శంకర్‌పల్లి: రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం ఆయన మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో జాతీయ ఆహార భద్రత మిషన్ పథకంలో భాగంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు కంది విత్తన సంచులు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులకు నాలుగు కిలోల కంది విత్తన సంచులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతును రాజు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందని అన్నారు. రైతులు నిత్యం వ్యవసాయశాఖ అధికారులను సంప్రదిస్తూ.. ప్రభుత్వం పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం మండల వ్యవసాయాధికారి చైతన్య మాట్లాడుతూ.. శంకర్‌పల్లి మండలానికి ప్రస్తుతం 16 క్వింటాళ్ల కందులు వచ్చాయని, నాలుగు క్లస్టర్స్‌కి నాలుగు క్వింటాళ్ల చొప్పు న అందిస్తామన్నారు రైతులు సంబంధిత పత్రా లు అందజేసి, అక్కడే కందులను తీసుకోవాల ని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ గిరిరాజు, నాయకులు ప్రవీణ్, రాంరెడ్డి, శ్రీనివాస్, సత్యనారాయణరెడ్డి, పాండురంగారెడ్డి, చంద్రమౌలి తదితరులు పాల్గొన్నారు.