
రెండు ఆలయాల్లో చోరీ
ఇబ్రహీంపట్నం: డివిజన్ పరిధిలోని ఓ గ్రామంలో రెండు ఆలయాల్లో విగ్రహాలు చోరీకి గురయ్యాయి. ఈ ఘటన ఇబ్రహీంపట్నం ఠాణా పరిధిలోని పోల్కంపల్లిలో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. గ్రామంలోని రామాలయంలో సీతారామలక్ష్మణ స్వాముల వారి పంచలోహ విగ్రహాలు, గంగాదేవి ఆలయంలో పెద్దమ్మ తల్లి, గంగాదేవి విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. రామాలయంలోని సీసీ టీవీ పుటేజీలను పరిశిలీంచగా ఓ దొంగ విగ్రహాన్ని సంచిలో పెట్టుకుని వెళ్తున్నట్లు గుర్తించారు. అనుమానితులు పోలీసుల అదపులో ఉన్నట్లు సమాచారం.
పంచలోహ విగ్రహాలను ఎత్తుకెళ్లిన దుండగులు

రెండు ఆలయాల్లో చోరీ