బుధవారం శ్రీ 2 శ్రీ జూలై శ్రీ 2025
8లోu
అంతర్గత రోడ్లు అధ్వానం
మొయినాబాద్: మున్సిపల్ పరిధిలో అంతర్గత రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. మున్సిపల్ కేంద్రంలోని స్టార్ కాలనీ, ముస్తఫా హిల్స్ కాలనీ, భరద్వజ్ కాలనీ, సహారా కాలనీ, విజయనగర్ కాలనీల్లో అంతర్గత రోడ్లు సరిగా లేవు. మురుగునీరు రోడ్లపై పారడంతో గుంతలమయంగా మారి నడవలేని పరిస్థితి నెలకొంది. చిన్నషాపూర్, పెద్దమంగళారం, చిలుకూరు, అప్పోజీగూడ, ముర్తూజగూడ, ఎనికేపల్లి, అజీజ్‌నగర్, హిమాయత్‌నగర్, సురంగల్ గ్రామాలకు వెళ్లే రోడ్లతోపాటు అంతర్గత రోడ్లు సైతం దెబ్బతిన్నాయి. వర్షాలు పడినప్పుడు రోడ్డుపై గుంతల్లో వర్షం నీరు నిలిచి రాకపోకలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. స్థానిక ప్రజలతోపాటు ప్రయాణికులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. వీధిదీపాల పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. కొన్నిచోట్ల గతంలో ఏర్పాటు చేసిన వీధిదీపాలు ఉన్నప్పటికీ అందులో కొన్ని చెడిపోయాయి. వాటిని మార్చి కొత్తవి ఏర్పాటు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. మున్సిపల్ కేంద్రంలో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ కొన్నేళ్లుగా వెలగడంలేదు. అధికారులు పట్టించుకోకపోవడంతో రాత్రి సమయంలో అంధకారం నెలకొంటోంది.
న్యూస్‌రీల్