
ముగ్గురు బాలకార్మికులకు విముక్తి
ఇబ్రహీంపట్నం రూరల్: వివిధ ప్రైవేటు పరిశ్రమల్లో పని చేస్తున్న ముగ్గురు బాల కార్మికులకు అధికారులు విముక్తి కల్పించారు. ఆపరేషన్ ముస్కాన్ ఆధ్వర్యంలో మంగళవారం దాడులు నిర్వహించారు. తుర్కయంజాల్ సమీపంలోని పలు పరిశ్రమల్లో పని చేస్తున్న బిహార్ రాష్ట్రానికి చెందిన ముగ్గురిని హోంకు తరలించారు. యజమానులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
సార్వత్రిక సమ్మెను
విజయవంతం చేయాలి
తుర్కయంజాల్: మున్సిపల్ కార్మికులకు కనీస వేతనాలు చెల్లించాలని కోరుతూ ఈ నెల 9న నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని మున్సిపల్ కార్మిక సంఘం ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రమావత్ సక్రు నాయక్ పిలుపునిచ్చారు. తుర్కయంజాల్‌లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వం వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు రమేష్, బాల నరసింహ, అనిత, శోభ, సునీత, హేమలత తదితరులు పాల్గొన్నారు.
యంగ్ ఎర్త్ లీడర్
ప్రోగ్రాంకు ఎంపిక
కడ్తాల్: డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, కౌన్సిల్‌ఫర్ గ్రీన్ రెవల్యూషన్ పర్యావరణ సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న యంగ్ ఎర్త్ లీడర్ ప్రోగ్రాంకు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఎంపికై ంది. ఈ మేరకు మంగళవారం సీజీఆర్ సంస్థ కోఆర్డినేటర్ రజనీకాంత్ పాఠశాలను సందర్శించి బేస్‌లైన్ సర్వే నిర్వహించారు. పాఠశాలకు సంబంధించిన పూర్తి వివరాలను హెచ్‌ఎం జంగయ్యను అడిగి నమోదు చేసుకున్నారు. పాఠశాలలో హార్వెస్టింగ్ పిట్, కంపోస్ట్ పిట్, డిక్లేర్ నో ప్లాస్టిక్ జోన్, డిక్లరేషన్ ఆఫ్ మథర్ ట్రీ, కిచెన్ గార్డెన్, సాయిల్ అండ్ సీడ్ మ్యూజియం, మెడిసినల్ గార్డెన్, రెన్యూవల్ ఎనర్జీ సోలార్, ప్లాంటేషన్, ప్రిపరేషన్ ఆఫ్ విలేజ్ జియోగ్రఫీ, మ్యాపు అండ్ రిపోర్టు, ప్లాంటేషన్ వంటి కార్యక్రమాల నిర్వహణకు తోడ్పడుతున్నందుకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కేంద్రం తీరుతోనే తెలంగాణకు అన్యాయం
షాద్‌నగర్: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుతోనే తెలంగాణకు అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ రఘు నాయక్ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రానికి వచ్చే పన్నుల్లో అధిక శాతం తెలంగాణ నుంచి వెళ్తున్నాయని, బడ్జెట్‌లో మాత్రం మొండిచెయ్యి చూపిస్తోందని విమర్శించారు. మెట్రో, ఆర్‌ఆర్‌ఆర్, మూసీనదీ ప్రక్షాళన, తదితర అభివృద్ధి పనులకు సరైన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈనెల 4న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్ విచ్చేస్తున్నారని, ఇందులో భాగంగా గ్రామస్థాయి నేతలతో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు చల్లా శ్రీకాంత్‌రెడ్డి, కృష్ణారెడ్డి, హరినాథ్‌రెడ్డి, వీరేశం, రాజు, నర్సింలు, సుదర్శన్‌గౌడ్, బాల్‌రాజుగౌడ్, ఇబ్రహీం, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

ముగ్గురు బాలకార్మికులకు విముక్తి

ముగ్గురు బాలకార్మికులకు విముక్తి