
రోడ్లపై మురుగు.. రోడ్ల పక్కనే చెత్త
మొయినాబాద్: మున్సిపల్ కేంద్రంతోపాటు పలు కాలనీలు,గ్రామాల్లో రో డ్ల పక్కనే చెత్తాచెదారం పేరుకుపోయింది. కాలువలు సరిగా లేకపోవడంతో మురుగునీరు రోడ్లపైనే పారుతోంది.ఉన్న వాటిని సైతం సరిగా శుభ్రం చేయకపోవడంతో ఈగలు, దోమలు చేరుతున్నాయి. మున్సిపల్ పరిధిలోని సహారా కాలనీ, స్టార్ కాలనీ, భరద్వజ్ కాలనీ, ముస్తఫా కాలనీ, విజయన గర్ కాలనీల్లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ సరిగా లేకపోవడంతో మురుగు కాలు వలు చెత్తాచెదారంతో నిండిపోయాయి.చిలుకూరు, పెద్దమంగళారం,అజీజ్‌నగర్, హిమాయత్‌నగర్,ఎనికేపల్లి,ముర్తూజగూడ,సురంగల్ గ్రామాల్లోనూ మురుగుకాలువల పరిస్థితి అధ్వానంగా ఉంది.స్పెషల్ డ్రైవ్ పేరుతో చెత్తాచెదారం తొలగింపు, పారిశుద్ధ్య నిర్వహణ చేపడుతున్నామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది.