
సేకరణ లేక.. రోడ్ల పక్కన చేరిక
చేవెళ్ల: మున్సిపల్ పరిధిలో ఎక్కడ చూసినా రోడ్లపక్కనే చెత్తా చెదారం పేరుకుపోయి కనిపిస్తోంది. ఇళ్ల ముందుకు చెత్త సేకరణ వాహనాలు సక్రమంగా రాకపోవడంతో ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడే పడేస్తున్నారు. చెత్త పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతోంది. పట్టణ కేంద్రంలోని పలు కాలనీల నుంచి వెళ్లే అండర్‌గ్రౌండ్ డైనేజీ కాలువ ప్రధాన రోడ్డు పక్కనే ఓపెన్‌గా ఉంది. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ కావడంతో ఇంకా పాలకవర్గం కొలువుదీరలేదు. అధికారులే ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నామని చెబుతున్నారు. ఇప్పటికే అంగడిబజార్, హౌసింగ్ బోర్డు, మల్కాపూర్ తదితర చోట్ల డ్రైనేజీ సమస్యలు గుర్తించిపరిష్కరించామన్నారు.