
18 లీటర్ల సారా పట్టివేత
ఆటో సీజ్, ఒకరి అరెస్టు
ఆమనగల్లు: పోలీసులు నిర్వహించిన వాహనాల తనిఖీల్లో 18 లీటర్ల నాటుసార సీజ్ చేసి ఒకరిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఆమనగల్లు ఎకై ్సజ్ సీఐ బద్యానాథ్ చౌహాన్ తెలిపిన ప్రకారం.. వెల్దండ మండలం పోచమ్మగడ్డ తండా నుంచి మాడ్గుల మండలం కలకొండ గ్రామానికి నాటుసారా తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు సీఐ బద్యానాద్ చౌహాన్ ఆధ్వర్యంలో ఎకై ్సజ్ సిబ్బంది వాహనాల తనిఖీ చేపట్టారు. పోచమ్మగడ్డ తండా నుంచి కలకొండకు ప్రయాణిస్తున్న ఆటోను తనిఖీ చేయగా అందులో తొమ్మిది ప్లాస్టిక్ బాటిల్స్‌లో 18 లీటర్ల సారా పట్టుబడింది. సారా, ఆటోను సీజ్ చేసి సారా తరలిస్తున్న పాండును అరెస్టు చేశారు. ఈ తనిఖీలో ఎకై ్సజ్ ఎస్‌ఐ అరుణ్‌కుమార్, సిబ్బంది శంకర్, దశరథ్, శ్రీను, బాబు, ఆమని, శ్రీజ తదితరులు పాల్గొన్నారు.
గంజాయి ముఠా గుట్టురట్టు
● ముగ్గురు నిందితులకు రిమాండ్
● పది కిలోల గంజాయి స్వాధీనం
శంకర్‌పల్లి: గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితులను సోమవారం రిమాండ్‌కు తరలించారు. మోకిల సీఐ వీరబాబు తెలిపిన ప్రకారం.. ఒడిశా రాష్ట్రానికి చెందిన శంకర్‌గౌడ(27), శ్రీధర్ పరిడా(19), మిని నాహక్(34) బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొంతకాలంగా వీరు తమ రాష్ట్రం నుంచి గుట్టుచప్పుడు కాకుండా గంజాయి తీసుకువచ్చి లేబర్ ఏరియాల్లో విక్రయిస్తున్నారు. మిని నాహక్ అనే మహిళ తీసుకువచ్చిన గంజాయిని సోమవారం ముగ్గురు కలిసి శంకర్‌పల్లి మండలం ఇంద్రారెడ్డినగర్ మీదుగా హైదరాబాద్ వైపు తరలిస్తుండగా రాజేంద్రనగర్ ఎస్‌ఓటీ పోలీసులు, మోకిల పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 10 కిలోల గంజాయి, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిపై ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి, కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ తెలిపారు.
బీఆర్‌ఎస్ నాయకులకు బెయిల్
● రూ.20 వేలతో రెండు పూచీకత్తులు అందజేయాలి
● నాంపల్లి 17వ అడిషినల్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశం
సిటీ కోర్టులు : మహా న్యూస్ ఛానెల్ కార్యాలయంపై దాడి కేసులో బీఆర్‌ఎస్ నాయకులకు సోమవారం నాంపల్లిలోని 17వ అడిషినల్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఒక్కక్కరూ రూ. 20వేలతో రెండు పూచీకత్తులు అందజేయాలని షరతులు విధించింది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సదరు న్యూస్ ఛానెల్‌లో తప్పుడు వార్తలు ప్రచురించారని, అసత్యపు ఆరోపణలతో కేటీఆర్ పరువుకు భంగం కలిగేలా మహా న్యూస్ యాజమాన్యం వ్యవహరించిందని బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌తోపాటు పలువురు బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు శనివారం మహా న్యూస్ కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కార్యాలయం అద్దాలు, కార్యాలయం ముందున్న కార్ల అద్దాలను ధ్వంసం చేశారని పోలీసులు వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వారి తరుఫున బీఆర్‌ఎస్ లీగల్‌సెల్ న్యాయవాదులు సోమవారం నాంపల్లి కోర్టులో వాదనలు వినిపించారు. దీంతో వారికి రూ.20 వేలతో రెండు పూచీకత్తులు, వ్యక్తిగత బాండ్‌లను కోర్టులో అందజేయాలని సూచించించిన నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

18 లీటర్ల సారా పట్టివేత