
అటవీ భూముల్లో ప్లాంటేషన్‌కు ప్రణాళిక
సిరిసిల్ల: జిల్లాలోని అటవీ భూములను ఆక్రమిస్తున్నారని, అటవీశాఖ నిర్మించిన చెక్‌డ్యామ్‌లను కూల్చివేసి, చెట్లను నరికివేసి కబ్జా చేస్తున్నారంటూ ‘అడవికి ఆపద’ శీర్షికన ‘సాక్షి’లో జూన్ 27న ప్రచురితమైన కథనంపై ఆ శాఖ అధికారులు స్పందించారు. చందుర్తి మండలం కొత్తపేట శివారులోని అటవీ భూములను పరిశీలించారు. బోర్లు వేసి పంటలను సాగు చేస్తున్నట్లు గుర్తించారు. అటవీ భూముల ఆక్రమణలు నిజమేనని తేలడంతో ఆ బోర్లను స్వాధీనం చేసుకుని ఫారెస్ట్ భూముల్లో ప్లాంటేషన్ నాటేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈమేరకు ఆ శాఖ ఉన్నతాధికారులకు నివేదించారు.