
సెంట్రల్ టీంతో వైద్యాధికారులు, సిబ్బంది
తంగళ్లపల్లి(సిరిసిల్ల): స్థానిక పీహెచ్‌సీని మంగళవారం జాతీయ నాణ్యతా ప్రమాణాల సభ్యులు(కేంద్ర బృందం) డాక్టర్ అనిర్భాన్ హోరె, డాక్టర్ కల్‌దీప్‌లు సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్‌రావు వారికి పీహెచ్‌సీలో అందిస్తున్న వైద్యసేవలు వివరాలు తెలిపారు. అనంతరం కేంద్ర బృందం సభ్యులు మాట్లాడుతూ.. పీహెచ్‌సీలో వైద్యులు, సిబ్బంది పనితీరును మెచ్చుకున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీరాములు, మెడికల్ ఆఫీసర్లు స్నేహ, రేణుప్రియాంక, ప్రమోద, క్వాలిటీ మేనేజర్ విద్యాసాగర్, డీపీవో ఉమ, సూపర్‌వైజర్లు, ఆశవర్కర్లు పాల్గొన్నారు.
డౌన్ సిండ్రోమ్ పిల్లల ఎదుగుదలకు సహకరించాలి
సిరిసిల్లకల్చరల్: పుట్టుకతో వచ్చే జన్యు సంబంధ డౌన్ సిండ్రోమ్ వ్యాధి ఉన్న పిల్ల ల ఎదుగుదలకు సహకరించాలని జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ మురళీధర్‌రావు కోరారు. రాజన్న అకాడమీ ఆఫ్ పీడియాట్రిషియన్స్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రపంచ డౌన్ సిండ్రోమ్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా అకాడమీ అధ్యక్షుడైన ఆయన మాట్లాడుతూ.. జన్యులోపాల కారణంగా సంభవించే వ్యాధి కారణంగా చిన్న పిల్లల్లో ఎదుగుదల ఉండదన్నారు. వారిలో ఆలోచనాస్థాయి కూడా తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీడియాట్రిషియన్లు సాయికుమార్ తడుక, శ్రవణ్‌రెడ్డి, నళిని, అంబేడ్కర్, ఉమేశ్, నిఖిత తదితరులు పాల్గొన్నారు.
కార్గో ద్వారా రాములోరి కల్యాణ తలంబ్రాలు
సిరిసిల్లఅర్బన్: శ్రీరామనవమి రోజు భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణానికి హాజరు కాలేని భక్తులు కల్యాణ తలంబ్రాలను ఆర్టీసీ కార్గో ద్వారా పొందవచ్చని సిరిసిల్ల డిపో మేనేజర్ ఒక ప్రకటనలో తెలిపారు. బస్టాండ్‌లోని కార్గో కౌంటర్‌లో రూ. 116లు చెల్లించి, వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. ఇంటి వద్దకే కల్యాణ తలంబ్రాలు తీసుకువస్తామని పేర్కొన్నారు. వివరాలకు 91542 98577 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

మాట్లాడుతున్న డాక్టర్ మురళీధర్‌రావు