నేడు తెలుగు రాష్ట్రాల స్థాయి ఎడ్ల పోటీలు | - | Sakshi
Sakshi News home page

నేడు తెలుగు రాష్ట్రాల స్థాయి ఎడ్ల పోటీలు

Dec 4 2025 7:38 AM | Updated on Dec 4 2025 7:38 AM

నేడు తెలుగు రాష్ట్రాల స్థాయి ఎడ్ల పోటీలు

నేడు తెలుగు రాష్ట్రాల స్థాయి ఎడ్ల పోటీలు

నేడు తెలుగు రాష్ట్రాల స్థాయి ఎడ్ల పోటీలు తాత్కాలిక ప్రాతిపదికన అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్ల నియామకం జిల్లాలో 43 ధాన్యం కొనుగోలు కేంద్రాలు పనితీరు మార్చుకోకుంటే సస్పెన్షనే.. ● సంక్షేమ వసతి గృహాల సిబ్బందికి కలెక్టర్‌ రాజాబాబు హెచ్చరిక

పెద్దారవీడు: మండలంలోని దేవరాజుగట్టు గ్రామం సమీపంలో వెలసిన కాశినాయన ఆశ్రమంలో త్రింశత్‌ (30వ) ఆరాధన మహోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల రాష్ట్ర స్థాయి పెద్దసైజు బండలాగుడు ఎడ్ల పందేలు గురువారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభించనున్నట్లు కమిటీ సభ్యులు బుధవారం సాయంత్రం తెలిపారు. 1 నుంచి 5వ బహుమతులు వరుసగా రూ.60,116, రూ.40,116, రూ.30,116, రూ 20,116, రూ.10,116 దాతలు ప్రకటించారు.

ఒంగోలు సిటీ: జిల్లాలోని ప్రైమరీ, ఉన్నత పాఠశాలల్లో ఖాళీగా ఉన్న స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు, సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టులకు తాత్కాలిక ప్రాతిపదికన అకడమిక్‌ ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి అర్హులైన అభ్యర్థులు ఈ నెల 5వ తేదీ లోపల దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ కిరణ్‌కుమార్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 5వ తేదీ లోపల ఆయా మండల విద్యాశాఖాధికారులను అందజేయాలని కోరారు. పోస్టుల వివరాలకు సంబంధిత మండల విద్యాశాఖాధికారులను సంప్రదించాలన్నారు.

ఒంగోలు సబర్బన్‌: జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయటానికి 43 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా సహకార అధికారి దేవిరెడ్డి శ్రీలక్ష్మి తెలిపారు. ఈ మేరకు ఆమె బుధవారం విడుదల చేసిన ప్రకటనలో జిల్లాలో సహకార శాఖ ద్వారా మొత్తం 43 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినట్లు చెప్పారు. ఇందులో 31 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్‌) ద్వారా, 9 పొగాకు ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య ద్వారా, 3 జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ (డీసీఎంఎస్‌) ద్వారా కేంద్రాలు నిర్వహిస్తారన్నారు. రైతులందరూ తామ పండించిన ధాన్యాన్ని సమీపంలోని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి విక్రయించుకుని ప్రభుత్వ మద్దతు ధర (ఎంఎస్‌పీ) పొందాలని విజ్ఞప్తి చేశారు.

మద్దిపాడు: సంక్షేమ వసతి గృహాలను, వసతి గృహాల్లో ఉండే విద్యార్థులను పట్టించుకోకుంటే సిబ్బందికి సస్పెన్షనే శిక్ష అని కలెక్టర్‌ రాజాబాబు హెచ్చరించారు. బుధవారం సాయంత్రం ఆయన మండల కేంద్రం మద్దిపాడులోని బీసీ, ఎస్సీ హాస్టల్స్‌ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన బీసీ హాస్టల్‌ లో విద్యార్థుల రోల్‌ గురించి వార్డెన్‌ ను ప్రశ్నించగా ఆయన పొంతన లేని సమాధానాలు చెప్పడంతో కలెక్టర్‌ సీరియస్‌ అయ్యారు. హాస్టల్లో అణువణువు పరిశీలించిన ఆయన బాత్రూముల డోర్లు చిరుకుపోయి ఉండడం గమనించారు. విద్యార్థుల మెనూ గురించి వార్డెన్‌ ను ప్రశ్నించారు. ప్రతి విషయం లోను వార్డెన్‌ పొంతనలేని సమాధానాలు చెబుతుండడంతో ఈ విధంగా పని చేస్తే సస్పెండ్‌ చేసేస్తానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు చదువు కోసం తల్లిదండ్రుల నుంచి దూరంగా వసతి గృహాల్లో ఉంటుంటారని, వారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత లేదా అంటూ గట్టిగా ప్రశ్నించారు. వారం రోజుల వ్యవధి ఇస్తూ పని తీరు మార్చుకోవాలని, లేదా ఇంటికి వెళ్లి పోవాల్సి వస్తుందని కలెక్టర్‌ హెచ్చరించారు. అనంతరం ఆయన ఎస్సీ హాస్టల్‌ ను పరిశీలించారు. రెండు బాలుర వసతి గృహాలు పరిశీలించిన అనంతరం వసతి గృహాల్లో చేయాల్సిన మార్పుల గురించి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లక్ష్మణ నాయక్‌, బీసీ సంక్షేమ శాఖ అధికారిణి నిర్మల జ్యోతి తో మాట్లాడారు. ఈ క్రమంలో ట్యూటర్‌ లను నియమిస్తే వసతి గృహాల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని విలేకరులు ప్రస్తావించగా, పీపీపీ విధానంలో ఎవరైనా స్పాన్సర్ని చూడాల్సి ఉందని అన్నారు. రెండు వసతి గృహాల్లో తీసుకోవాల్సిన చర్యలు గురించి ఆయన సంక్షేమ శాఖ అధికారులతో మాట్లాడారు. అదే క్రమంలో విద్యార్థులు చదవడానికి కూర్చునే ప్రాంతాన్ని పరిశీలించి ఇంజనీర్‌ తో మాట్లాడి అక్కడ ఎటువంటి నిర్మాణం చేపట్టాలన్న విషయంపై సమగ్రంగా ఫైల్‌ తయారు చేయాలని అధికారులకు తెలిపారు. కార్యక్రమంలో ఆయన వెంట ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, తహసీల్దార్‌ ఆదిలక్ష్మి, ఇన్చార్జి ఎంపీడీవో వరప్రసాద్‌, పలువురు జిల్లాస్థాయి, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement