సంక్రాంతికి జాతీయ స్థాయి ఎడ్ల పందేలు
యర్రగొండపాలెం: సంక్రాంతి పండుగ సందర్భంగా జాతీయ స్థాయిలో ఎడ్ల పందేలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్ బుధవారం తెలిపారు. 2026 జనవరి 12, 13, 14 తేదీల్లో ఈ పోటీలు నిర్వహిస్తామని, ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఉన్న పార్టీ నాయకులు కమిటీగా ఏర్పడి ఆయా కార్యక్రమాలను పర్యవేక్షిస్తారని, ఎడ్లతోపాటు వాటితో వచ్చిన వారికి మంచి వసతులు కల్పించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రెండేళ్లుగా అన్ని విధాలుగా కుదేలైన రైతులకు ఉపశమనం కలుగుతుందన్న ఉద్దేశంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా స్థానిక పుల్లలచెరువు రోడ్డులోని పార్కుకు సమీపంలో ఉన్న ఖాళీ స్థలాన్ని, వివిధ ప్రాంతాల్లో ఉన్న ఎద్దులు లాగే బండలను ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఒంగోలు మూర్తిరెడ్డి, రాష్ట్ర మాజీ కార్యదర్శి ఉడుముల శ్రీనివాసరెడ్డి, రైతు విభాగం జిల్లా కార్యదర్శి వై.వెంకటేశ్వరరెడ్డి, పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శి భూమిరెడ్డి, సుబ్బారెడ్డి, పార్టీ మండల కన్వీనర్లు ఏకుల ముసలారెడ్డి, గంట వెంకటరమణారెడ్డి, ఎస్.పోలిరెడ్డి, దోమకాలు వెంకటేశ్వర్లు, ఎంపీపీ దొంతా కిరణ్‌గౌడ్, జెడ్పీటీసీలు చేదూరి విజయభాస్కర్, యేర్వ చలమారెడ్డి, నాయకులు ఆళ్ల ఆంజనేయరెడ్డి, కె.ఓబులరెడ్డి, జానకి రఘు, ఎస్.రంగబాబు, సయ్యద్ జబీవుల్లా, కందూరి కాశీవిశ్వనాథ్, పబ్బిశెట్టి శ్రీనివాసులు, సూరె శ్రీనివాసులు, దోగిపర్తి సంతోష్ కుమార్, సరళ, శార, జి.సుబ్బయ్య, ఎల్.రాములు, శంబిరెడ్డి పాల్గొన్నారు.


