ఎయిడ్స్ భూతం..!
మండలాల వారీగా మందులు వాడుతున్న వారు
కబళిస్తున్న..
ఎయిడ్స్ భూతం కబళిస్తోంది. అవగాహన లేమి, నిర్లక్ష్యంతో హెచ్‌ఐవీ బారిన బారి
జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
ఓ పక్క స్వచ్ఛంద సంస్థలు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా యువత పెడచెవిన పెట్టి వ్యాధి బారిన
పడి కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. ముఖ్యంగా పశ్చిమ ప్రకాశంలో
ఈ మహమ్మారి బారిన పడే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది.
మార్కాపురం:
ఎయిడ్స్..ఈ పేరు వింటేనే అందరికీ భయం. అయినా నిర్లక్ష్యంతో ఈ వ్యాధి బారిన పడి జీవితాలను, కుటుంబాలను ప్రమాదంలో పడేస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలో పశ్చిమ ప్రకాశంలో ఎయిడ్స్ బారిన పడే వారిన సంఖ్య పెరుగుతోంది. పశ్చిమ ప్రకాశం నుంచి విజయవాడ, గుంటూరు, ఒంగోలుకు వెళ్లి చికిత్స చేయించుకునే వారి సంఖ్య దాదాపు 4500లకు పైగా ఉన్నారు. అనైతిక శృంగారం, ఇన్‌ఫెక్టెడ్ నీడిల్స్, ఇన్‌ఫెక్టెడ్ రక్తాన్ని మరొకరికి ఎక్కించటం ద్వారా, గర్భిణి బిడ్డకు వ్యాప్తి, హెచ్‌ఐవీ బారిన పడిన తల్లి పాలు ఇచ్చినప్పుడు తల్లి నుంచి బిడ్డకు వ్యాపిస్తోంది. జిల్లాలో హెచ్‌ఐవీ నిర్ధారణ కేంద్రాలు మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు, ఒంగోలు, యర్రగొండపాలెం, కంభం, పొదిలి, దర్శి, సింగరాయకొండలో ఉన్నాయి. మార్కాపురం, ఒంగోలులో ఏఆర్‌టీ సెంటర్లు ఉన్నాయి.
రోజు రోజుకు పెరుగుతున్న బాధితులు
జిల్లాలో మార్కాపురం, కంభం, బేస్తవారిపేట, రాచర్ల, అర్ధవీడు, త్రిపురాంతకం, పుల్లలచెరువు, యర్రగొండపాలెం, గిద్దలూరు, కొమరోలు తదితర ప్రాంతాల్లో హెచ్‌ఐవీ బాధితుల సంఖ్య పెరుగుతున్నట్లు ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. వెనుకబడిన పశ్చిమ ప్రకాశంలో శాశ్వతమైన నీటి వనరులు, ఫ్యాక్టరీలు లేవు. దీంతో ఉపాధి నిమిత్తం ఈ ప్రాంత ప్రజలు ఏడాదిలో ఆరు నెలల పాటు కుటుంబాలను వదిలి దేశంలోని ప్రధాన నగరాలకు వలస వెళుతుంటారు. ఇది వారికి శాపంగా మారుతోంది. మార్కాపురం జిల్లా వైద్యశాలలో ఏఆర్‌టీ (యాంటీ రెట్రో వైరల్ ట్రిట్‌మెంట్) సెంటర్‌లో నమోదైన వివరాలను పరిశీలిస్తే హెచ్‌ఐవీ శరవేగంగా చాప కింద నీరులా పలువురి ప్రాణాలను బలి కోరుతుంది. ఎక్కువగా ఆటో, లారీ డ్రైవర్లు, వలస కూలీలు, పలకల కార్మికులు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. హెచ్‌ఐవీతో జన్మించిన చిన్నారులకు 15 ఏళ్ల వారికి ప్రభుత్వం వాత్సల్య పథకం అమలు చేస్తోంది.
ప్రైవేటు వైద్యశాలల్లో చికిత్స..
ఈ వ్యాధి బారిన పడిన వారు పట్టణంలోని ప్రైవేట్ వైద్యశాలలతో పాటు హైదరాబాద్, విజయవాడ, ఒంగోలు, గుంటూరులలో చికిత్స పొందుతున్నారు. ఇలా ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న వారు సుమారు 4500 మందికి పైగా ఉండొచ్చని అంచనా. మార్కాపురం డివిజన్‌లో మార్కాపురం, గిద్దలూరు, కంభం, యర్రగొండపాలెం, బేస్తవారిపేట, కొమరోలు, పుల్లలచెరువు, బేస్తవారపేట, పెద్దారవీడు, పెద్దదోర్నాల ప్రాంతాల్లో ఎయిడ్స్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. డివిజన్‌లో అత్యధికంగా దొనకొండ, త్రిపురాంతకం, పుల్లలచెరువు, కొమరోలు మండలాల్లో హెచ్‌ఐవీ కేసులు నమోదవుతున్నట్లు వైద్య సిబ్బంది చెబుతున్నారు. ఈ ప్రాంతం నుంచి వందలాది మంది కూలీలు కుటుంబాలకు దూరంగా వలసలు పోవటం కారణమవుతోంది. వీరిలో ఎక్కువ మంది 20 నుంచి 40 ఏళ్ల లోపు వారే. గిద్దలూరు, కొమరోలు, కంభం ప్రాంతాల్లో పలువురు సైనికోద్యోగులు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఎయిడ్స్ వ్యాదిగ్రస్తులకు ప్రభుత్వం ఉచితంగా మందులను అందిస్తోంది. ఈ మందులు వారి జీవితకాలాన్ని పొడిగిస్తాయి. కాగా ఇటీవల కాలంలో చికిత్స తీసుకోకుండా పలువురు మృతి చెందిన ఘటనలు ఉన్నాయి.
మండలం పేరు మందులు
వాడుతున్న వారు
మార్కాపురం 1350
అర్ధవీడు 155
కంభం 260
బేస్తవారపేట 290
దోర్నాల 301
గిద్దలూరు 570
దొనకొండ 325
కొమరోలు 260
కొనకనమిట్ల 150
కురిచేడు 247
పెద్దారవీడు 242
పుల్లలచెరువు 345
త్రిపురాంతకం 478
యర్రగొండపాలెం 62
తర్లుపాడు 295
రాచర్ల 223
ఎయిడ్స్ భూతం..!
ఎయిడ్స్ భూతం..!


