ప్రైవేటీకరణతో ఉచిత వైద్య సేవలు ఎలా..? | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటీకరణతో ఉచిత వైద్య సేవలు ఎలా..?

Dec 1 2025 7:30 AM | Updated on Dec 1 2025 7:30 AM

ప్రైవేటీకరణతో ఉచిత వైద్య సేవలు ఎలా..?

ప్రైవేటీకరణతో ఉచిత వైద్య సేవలు ఎలా..?

మార్కాపురం: రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలను, వాటి అనుబంధ వైద్యశాలలను ప్రైవేట్‌పరం చేస్తే పేదలకు ఉచిత వైద్యసేవలు ఎలా అందుతాయని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జి అన్నా రాంబాబు ప్రశ్నించారు. మెడికల్‌ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మార్కాపురం పట్టణంలోని , 12, 15వ బ్లాకుల్లో ఆదివారం నిర్వహించిన రచ్చబండ, కోటి సంతకాల సేకరణలో ఆయన మాట్లాడారు. దివంగత వైఎస్సార్‌ ముఖ్యమంత్రి అయ్యే వరకూ 7 మెడికల్‌ కళాశాలలు ఉన్నాయని, వైఎస్సార్‌ హయాంలో 5 మంజూరు చేశారని, వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఏకంగా 17 మెడికల్‌ కళాశాలలు మంజూరుచేసి చరిత్ర సృష్టించారని అన్నారు. ఇప్పుడున్న మెడికల్‌ కళాశాలల్లో ఏ ఒక్కటైనా చంద్రబాబు తెచ్చాడా అని ప్రశ్నించారు. 14 ఏళ్లలో మూడుసార్లు సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు ఎందుకు మెడికల్‌ కళాశాలలను తేలేకపోయాడని ప్రశ్నించారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఉచిత వైద్యం అందించడం, మెడికల్‌ విద్యను అందరికీ అందుబాటులోనికి తేవడం కోసం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బృహత్తర ఆశయంతో మెడికల్‌ కాలేజీలు మంజూరు చేయించారన్నారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే పీపీపీ విధానానికి వెళ్లడం దుర్మార్గమన్నారు. ఈ ఉద్యమం పార్టీలతో సంబంధం లేకుండా ప్రజా సంక్షేమం కోసం చేపట్టిందని, అందరూ ముందుకు వచ్చి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సంతకాల సేకరణలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రజల అభిప్రాయాన్ని మన్నించి ప్రభుత్వమే మెడికల్‌ కళాశాలలను నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. 2024లో వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వస్తే మిగిలిన కాలేజీలు కూడా పూర్తయితే పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్య సీట్లు దక్కేవన్నారు. నెల్లూరు పార్లమెంట్‌ పరిశీలకుడు, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి మాట్లాడుతూ పీపీపీ విధానంలో తన బినామీలకు దోచిపెట్టేందుకు చంద్రబాబు కుట్ర పన్నారని మండిపడ్డారు. మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఎవ్వరూ చేయని అభివృద్ధిని వైవెస్‌ జగన్మోహన్‌రెడ్డి చేసి చూపారన్నారు. మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ షంషేర్‌ ఆలీబేగ్‌, పీఎల్‌పీ యాదవ్‌, డాక్టర్‌ మగ్బుల్‌ బాషా, మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు సలీమ్‌, చెంచిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వమే రాష్ట్రంలో మెడికల్‌ కళాశాలలను నిర్మించాలని, ప్రైవేట్‌పరం చేసే ఆలోచన విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ నారు బాపన్‌రెడ్డి, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ బాలమురళీకృష్ణ, వైస్‌ చైర్మన్‌ అంజమ్మ శ్రీనివాసులు, ఏఎంసీ మాజీ చైర్మన్‌ గొలమారి శ్రీనివాసరెడ్డి, పార్టీ నాయకులతో కలిసి పాల్గొని మాట్లాడారు. కౌన్సిలర్లు డాక్టర్‌ కనకదుర్గ, సిరాజ్‌, కొత్త కృష్ణ, చాటకొండ చంద్ర, ఉత్తమ్‌కుమార్‌, రోజ్‌లిడియా, గుంటక వనజాక్షి చెన్నారెడ్డి, ముత్తారెడ్డి వెంకటరెడ్డి, పత్తి రవిచంద్ర, పట్టణ ప్రధాన కార్యదర్శి గొలమారి సత్యనారాయణరెడ్డి, రైతు విభాగం పట్టణ అద్యక్షులు నూనె శివారెడ్డి, మాజీ ఎంపీపీ గాయం శ్రీనివాసరెడ్డి, గౌస్‌ మొహిద్దీన్‌, పత్తి కృష్ణ, పంబి వెంకటరెడ్డి, వార్డుల ఇన్‌ఛార్జిలు ఉస్మాన్‌, కోటిరెడ్డి, తనుబుద్ధి నాగార్జునరెడ్డి, బిలాల్‌, రాచకొండ శ్రీను, సాయి, దస్తగిరి, సర్పంచ్‌ గురునాధం, చిప్స్‌ శ్రీనివాస్‌, గుంటక అంజిరెడ్డి, ఏడుకొండలు, రఫీ, మందటి శివారెడ్డి, చాటకొండ నాగరాజు, పోరుమామిళ్ల విజయలక్ష్మి, రామిరెడ్డి, మహమ్మద్‌, జాఫర్‌, ఉస్మాన్‌, షేక్‌ కరీముల్లా, మల్లిక, చదలవాడ రమణారెడ్డి, ఖాశీం, సయ్యద్‌ గఫూర్‌, నాయకులు తదితరులు పాల్గొన్నారు. వార్డుల్లో అన్నా రాంబాబు, జంకె వెంకటరెడ్డిలను క్రేన్‌ సహయంతో గజమాలతో సత్కరించారు.

పేదలకు మెరుగైన వైద్యం చంద్రబాబుకు

ఇష్టం లేదు

మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ

మార్కాపురం ఇన్‌చార్జి అన్నా రాంబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement