
భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వండి..
● సబ్‌కలెక్టర్‌కు రైతుల వినతి
మర్రిపూడి: ఎన్‌హెచ్544జీ (గ్రీన్‌ఫీల్డ్ హైవే)కు అవసరమైన 6.51 ఎకరాల భూములు కోల్పోయిన ఏడుగురు రైతులకు సుమారు రూ.65 లక్షలు పరిహారం చెల్లించాలని మండలంలోని దుగ్గిరెడ్డిపాలెం గ్రామస్తులు రోడ్ పనులను పరిశీలించేందుకు మర్రిపూడి వచ్చిన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వరకుమార్‌కు మంగళవారం విన్నవించారు. దాదాపు ఏడాది గడుస్తున్నా పరిహారం ఇవ్వకుండా అధికారులు రేపు, మాపు అని కాలయాపన చేస్తున్నారని దుగ్గిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన బూదాల ఆశీర్వాదం, దుద్దుకుంట కోటయ్య, ఆకుల పెదగంగిరెడ్డి, ఆకుల సుగుణమ్మ, ఆకుల గంగిరెడ్డి, గురుగూరి ఆదెమ్మ, బీ ఆదిలక్ష్మిలు డిప్యూటీ కలెక్టర్ ముందు వాపోయారు. ఈ భూమి ద్వారా వ్యవసాయాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్నామని, అసైన్‌మెంట్ భూమిని గతంలో అధికారులు ఎలాంటి విచారణ జరపకుండా ఏడబ్ల్యూ ల్యాండ్ అని రాసి పంపారని, విచారించి మాకు తగు న్యాయం చేయండి సార్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌కు సమస్యను విన్నవిస్తున్న దుగ్గిరెడ్డిపాలెం గ్రామస్తులు అంటూ డిప్యూటీ కలెక్టర్‌కు గ్రామస్తులు విన్నవించారు. గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులకు ఆటంకం పెట్టరాదని, రైతుల సమస్యలు వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని, మీ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట తహశీల్దార్ జనార్దన్ డీటీ రాజు, వీఆర్వోలు ఉన్నారు.