
8 కేజీల గంజాయి పట్టివేత
ఒంగోలు టౌన్: ఒంగోలు నగరంలో 8 కేజీల గంజాయిని సీజ్ చేసి, ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు ఎకై ్సజ్ పోలీసులు తెలిపారు. వివరాలు.. ఒంగోలులో ఎకై ్సజ్ పోలీసులతోపాటు ఈఎస్‌టీఎఫ్ సిబ్బంది మంగళవారం విస్తృతంగా తినిఖీలు నిర్వహించారు. ఏబీఎం కాలేజీ గ్రౌండ్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని, అతని వద్ద ఉన్న బ్యాగ్‌ను తనిఖీ చేయగా 8 కేజీల గంజాయి లభ్యమైంది. నిందితుడిని చిత్తూరు జిల్లా నగరి గ్రామానికి చెందిన ఎస్.మణిగా గుర్తించారు. తనిఖీల్లో ఎకై ్సజ్ సీఐ ఎ.లీనా, సబ్ ఇన్‌స్పెక్టర్ సీహెచ్ గీత, ఈఎస్‌టీఎఫ్ ఎస్సై రవి ఆంజనేయులు, సిబ్బంది పాల్గొన్నారు.
బెల్టుషాపులను కట్టడి చేయాలి
● తహసీల్దార్‌కు టీడీపీ నాయకుడి ఫిర్యాదు
కంభం: మార్కాపురం డివిజన్‌లోని అన్ని గ్రామాల్లో యథేచ్ఛగా నిర్వహిస్తున్న మద్యం బెల్టు షాపులను కట్టడి చేయాలని కందులాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు నరాల చెన్నారెడ్డి మంగళవారం తహసీల్దార్ వి.కిరణ్‌కు ఫిర్యాదు చేశారు. ఎకై ్సజ్ అధికారులు అవినీతికి పాల్పడుతూ బెల్టు షాపుల గురించి పట్టించుకోవడం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. కంభం ఎకై ్సజ్ పరిధిలోని కంభం, అర్ధవీడు, బేస్తవారిపేట మండలాల్లో ఊరూరా బెల్టుషాపులు నిర్వహిస్తూ అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని వివరించారు. ఎకై ్సజ్ ఉన్నతాధికారులు స్పందించి బెల్టు షాపుల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
విభిన్న ప్రతిభావంతుల సమస్యలు పరిష్కరించాలి
ఒంగోలు వన్‌టౌన్: జిల్లాలోని విభిన్న ప్రతిభావంతుల సమస్యలను పరిష్కరించాలని ఉమ్మడి ప్రకాశం జిల్లా విభిన్న ప్రతిభావంతల ఏడీ సీహెచ్ సువార్తకు మంగళవారం విభిన్న ప్రతిభావంతుల సంఘాల నాయకులు వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో దివ్యాంగ సంఘాల నాయకులు ఎస్‌కే కాలేషా, ఎం. సులోచనారాణి, ఎస్‌డీ అమీర్ హంజా, పసుమర్తి రాజేష్, ముల్లా మదర్‌వలి పాల్గొన్నారు.

8 కేజీల గంజాయి పట్టివేత

8 కేజీల గంజాయి పట్టివేత