
వైఎస్సార్ చేయూత, సీ్త్రనిధి పథకాలతో ఆర్థికంగా స్థిరపడ్డా..
వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఒక్కో సంవత్సరానికి రూ.18,750 ఇచ్చారు. దీనికి తోడు సీ్త్రనిధి నుంచి రూ.71,250 లోను ఇచ్చారు. రూ.90 వేలతో రెండు పాడి గేదెలను కొనుగోలు చేశాను. ప్రతి రోజు పాలును కేంద్రానికి పోస్తాను. నెలకు ఆదాయం రావడంతో కొన్ని అప్పులు తీర్చాను. రెండు సంవత్సరాలు చేయూత రూ.37,500 రావడంతో మరో గేదెను కొనుగోలు చేశాను. వచ్చిన ఆదాయంతో లోనుకు వాయిదా కడుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. పిల్లలను కూడా చదివించుకుంటున్నా. వైఎస్సార్ చేయూత పథకం ఎంతో ఉపయోగపడింది. సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు.
– ఎస్‌కె సుల్తాన్‌బీ, అల్లూరు, కొత్తపట్నం మండలం